Revanth Reddy visits Birla Mandir Today: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియగా.. గురువారం (నవంబర్ 30) పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అగ్ర నేతలు అందరూ తమ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బిర్లా టెంపుల్‌లో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి పూజలు చేశారు.
బుధవారం ఉదయం గాంధీభవన్ నుంచి రేవంత్ రెడ్డి, ఇంఛార్జి ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్ పలువురు నేతలు బిర్లా టెంపుల్‌కు బయలుదేరారు. అయితే గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఐదుగురు మాత్రమే వెళ్లాలని సూచించారు. దీంతో రేవంత్, ఠాక్రే, అంజన్ కుమార్, మల్లు రవి మాత్రమే బిర్లా మందిర్‌కు వెళ్లారు. బిర్లా టెంపుల్‌లో వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి రేవంత్ రెడ్డి పూజలు చేశారు.
Also Read: Deeksha Divas: తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్.. ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం!
బిర్లా టెంపుల్‌లో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు.. నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, నరేందర్ రెడ్డి, వీహెచ్ తదితరులు నాంపల్లి దర్గా వద్ద ప్రార్థనలు చేశారు.