Ekadashi 2024 Date and Time: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈరోజు ఏకాదశి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా (దేవశయనీ ఏకాదశి) జరుపుకుంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. సనాతన ధర్మంలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనదిగా, పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుండి విష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి కోసం క్షీరసాగర్‌కు వెళ్లి కార్తీక మాసంలోని ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశి శుభ సమయం, పూజా విధానంను ఓసారి తెలుసుకుందాం.
దేవశయని ఏకాదశి శుభ సమయం:
హిందూ క్యాలెండర్ ప్రకారం.. దేవశయని ఏకాదశి తిథి జూలై 16న రాత్రి 8:33 గంటలకు ప్రారంభమమై.. జూలై 17న రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం దేవశయని ఏకాదశి వ్రతం జూలై 17న చేసుకోవచ్చు. ద్వాదశి తిథి ముగిసేలోపు దేవశయని ఏకాదశి వ్రతం విరమించాలి. ఈసారి పరాన్ సమయం జూలై 18 ఉదయం 5:35 నుండి 8:44 వరకు ఉంటుంది.
పూజా విధానం:
దేవశయని ఏకాదశి నాడు రాత్రిపూట విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించండి. పసుపు వస్తువులను.. ముఖ్యంగా పసుపు బట్టలు సమర్పించండి. శ్రీ హరికి ధూపం, దీపాలు, పండ్లు, పుష్పాలు సమర్పించండి. ఆరతి తరువాత విష్ణువును మంత్రంతో ప్రార్థించండి.
విష్ణువు మంత్రాలు:
1. ఓం నమో నారాయణ.
2. ఓం నమో: భగవతే వాసుదేవాయ.
3. ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి.
తన్నో విష్ణుః ప్రచోదయాత్.
4. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యమ్
వన్దే విష్ణుం భవభయహరం సర్వ్లోకైకనాథమ్ ।
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)