Honest Leave Request: పని చేస్తున్న సంస్థలలో సెలవులు సంపాదించుకోడానికి ఎంప్లాయ్స్ ఎన్ని అబద్ధాలు చెబుతుంటారో తెలిసిందే. కానీ ఒక ఎంప్లాయ్ మాత్రం ఈ ధోరణికి విభిన్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. తాజాగా సోషల్ మీడియాలో ఒక కార్పోరేట్ ఆఫీస్ మేనేజర్.. నిజాయితీతో ఏదైనా సాధించుకోవచ్చు అనే స్టోరీని పంచుకున్నారు. ఈ మేనేజర్ వాళ్ల ఆఫీస్‌లో పని చేసే ఒక ఎంప్లాయ్ హానెస్ట్‌కి ఫిదా అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Sydney Bondi Beach : ఆస్ట్రేలియా కాల్పులకు హైదరాబాద్ లింక్.. పూర్తి వివరాలు ఇవే..!
తాజాగా ఒక మేనేజర్ లింక్డ్ఇన్‌లో వాళ్ల ఆఫీస్‌లో పని చేస్తున్న ఒక ఎంప్లాయ్ లీవ్ రిక్వెస్ట్ మెయిల్ పంచుకున్నారు. ప్రస్తుతం ఇది ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌లో ఒక ఉద్యోగి తన వ్యక్తిగత కారణం కోసం సెలవు కోరుతూ పంపిన ఇమెయిల్ స్క్రీన్‌షాట్ కూడా ఉంది. తన స్నేహితురాలు మరుసటి రోజు ఉత్తరాఖండ్‌లోని తన స్వస్థలానికి బయలుదేరుతోందని, తిరిగి జనవరి ప్రారంభం వరకు రాదని వివరిస్తూ ఆ ఎంప్లాయ్ ఒక రోజు సెలవు కోరాడు. ఆమె ఇంటికి వెళ్లే ముందు తనతో టైం స్పెండ్ చేయడానికి తనకు లీవ్ కావాలని ఈ మెయిల్‌లో మేనేజర్‌కు చెప్పాడు.
”హాయ్ సర్, నేను డిసెంబర్ 16న సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. నా స్నేహితురాలు 17న ఉత్తరాఖండ్‌లోని తన ఇంటికి బయలుదేరుతోంది. తను తిరిగి జనవరి ప్రారంభం వరకు రాదు, కాబట్టి ఆమె వాళ్లింటికి వెళ్లే ముందు తనతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. నాకు లీవ్ ఇస్తున్నారో లేదో చెప్పండి” అని లీవ్ రిక్వె్స్ట్‌ను ఆ ఎంప్లాయ్ తన మేనేజర్‌కు ఇమెయిల్‌లో పంపినట్లు ఈ పోస్ట్‌లో ఉంది. దీని స్క్రీన్‌షాట్‌తో పాటు, గతంలో లీవ్ రిక్వెట్ ఎలా ఉండేదో మేనేజర్ ఈ పోస్ట్‌లో వివరించాడు.
”ఇటీవల నా ఇన్‌బాక్స్‌లో ఈ మెయిల్ కనిపించింది. ఇదే మెయిల్ దశాబ్దం క్రితం వచ్చి ఉంటే.. ఈ ఉదయం 9:15 గంటలకు అకస్మాత్తుగా “హెల్త్ లీవ్” మెసేజ్‌గా వచ్చి ఉండేది. అదే నేడు ఈ లీవ్ అభ్యర్థన చాలా ముందుగానే నా దగ్గరకు నిజమైన కారణంతో వచ్చింది. కాలం మారుతోంది, నిజాయితీగా చెప్పాలా? నాకు ఈ వెర్షన్ ఇష్టం. ప్రేమకు నో చెప్పలేం కదా? ఆమోదించి వదిలేయండి” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. నిజానికి ఈ పోస్ట్ చాలా మంది లింక్డ్ఇన్ యూజర్స్‌ను ఆకట్టుకుంది. వారు మేనేజర్ లీవ్ రిక్వెస్ట్‌పై స్పందించిన తీరును, అలాగే ఉద్యోగి నిజాయితీని ప్రశంసించిన విధానానికి ముగ్దులైనట్లు తెలిపారు. దీనిపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు.
READ ALSO: IPL Mini Auction 2026: KKR వదిలించుకుంటే.. RCB చేరదీసిన ప్లేయర్ ఇతనే!