భారతదేశంలో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తులం ధర లక్షా 30 వేలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే గత పది రోజులుగా వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. నేడు స్థిరంగా ఉన్నాయి. ఇది పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,944గా.. 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.11,865గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,29,440గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,650గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
బంగారంతో పాటు భారీగా పెరుగుతున్న వెండి ధరలు నేడు కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి.. 1,89,000గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,06,000గా ఉంది. పెరిగిన ధరలతో సామాన్య జనాలు బంగారం, వెండి కొనడానికి జంకుతున్నారు. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి భారీగా డిమాండ్ పెరుగుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. గోల్డ్, సిల్వర్ పెరుగుదలకు అంతర్జాతీయంగా పరిణామాలు కూడా కారణం అవుతాయన్న విషయం తెలిసిందే.