Sampath Kumar
Author- NTV Telugu-
Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, 13 మందికి గాయాలు!
చిత్తూరు శివారు ప్రాంతం గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న టిప్పర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు. ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం 20 అడుగులు జారుకుంటూ రోడ్డు […] -
Viral Video: సామ్‌తో సెల్ఫీ కోసం లగెత్తాడు.. కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు!
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ మంచి ఆటతీరును ప్రదర్శించాడు. టీమిండియాపై నాలుగు ఇన్నింగ్స్‌లలో (60, 8, 23, 22) 28.25 సగటుతో 113 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాల ఘటనలతో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సామ్.. ఒక్క సిరీస్‌తో ఆస్ట్రేలియా అభిమానులకు క్రేజీ ప్లేయర్‌గా మారిపోయాడు. అతడి ఆటోగ్రాఫ్ కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. అయితే ఆటోగ్రాఫ్ కోసం ఓ […] -
CM Revanth Reddy: నేటి నుంచి సీఎం విదేశీ పర్యటన.. భారీ పెట్టుబడులే లక్ష్యం!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనల్లో పాల్గొననున్నారు. గురువారం రాత్రి 10 గంటలకు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్‌కు బయలుదేరుతుంది. 17, 18, 19 తేదీల్లో సింగపూర్‌లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో […] -
Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా!
ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 400 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంక్రాంతికి ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ ఘటనపై రాత్రే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. నేడు ఖమ్మం మార్కెట్‌ను పరిలిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా అని […] -
Formula E Race Case: కేటీఆర్‌ను విచారిస్తున్న ఈడీ.. వీటిపైనే ప్రశ్నలు!
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో కేటీఆర్‌ను అధికారులు విచారిస్తున్నారు. గంట నుంచి విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కేటీఆర్ నుంచి కీలక సమాచారంను ఈడీ అధికారులు రాబడుతున్నారు. నిధుల బదలాయింపు పైనే ఈడీ ఫోకస్ పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లించారన్న దానిపైనే ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది. […] -
Jaipal Reddy: రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి: జీవన్ రెడ్డి
ప్రస్తుత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు అని, తెలంగాణ రాష్ట్ర సాకారం చేయడంలో జైపాల్ రెడ్డి పాత్రను మర్చిపోలేమన్నారు. ఇవాళ హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు రావడానికి, మెట్రో రైల్ రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకం అని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనదని ఎమ్మెల్యే వినోద్ కుమార్ […] -
KTR-ED: ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్!
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈడీ ఆఫీస్ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో […] -
KTR: ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్!
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు కార్యాలయం వద్ద మోహరించారు. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై […] -
Enumamula Agriculture Market: తెరుచుకున్న వరంగల్ ఎనుమాముల మార్కెట్.. పోటెత్తిన తెల్ల బంగారం!
సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఐదు రోజుల సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభమైంది. వరుస సెలవుల అనంతరం మార్కెట్ యార్డు తెరుచుకోవండతో.. తమ పంటలను విక్రయించేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. వేల సంఖ్యలో పత్తి, మిర్చి బస్తాలతో మార్కెట్ కళకళలాడుతోంది. ముఖ్యంగా తెల్ల బంగారం భారీగా వచ్చింది. రైతులు భారీగా తరలిరావడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సుమారు 5,000 బస్తాల మిర్చి […] -
Nalgonda Collector: ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.. నల్గొండ కలెక్టర్ సంచలన నిర్ణయం!
నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుర్రంపోడు మండలం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్.. అనధికారికంగా విధులకు గైహాజరైన సిబ్బందిని సస్పెండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఫార్మాసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్‌ను ఉద్యోగాల నుంచి తొలగించారు. అలానే ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం […]
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!