జనసేన 2014లో పోరాటాల గడ్డ తెలంగాణలో ప్రారంభించాం అని, ఆంధ్రప్రదేశ్‌లో నిలదొక్కుకున్నాం అని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన పార్టీ అని చెప్పారు. కులం, కుటుంబం, రాష్ట్రం, ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదన్నారు. ప్రజల కష్టాలు పరిష్కరించినప్పుడు తన నిర్ణయం సరైందే అనిపించిందన్నారు. పార్టీ మొదలుపెట్టినప్పుడు తన ఆలోచన సగటు మనిషి ఆలోచన అని.. జనాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆకాంక్షలు […]
ఐపీఎల్ 2008 సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, ఎస్ శ్రీశాంత్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. హర్భజన్.. శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటనకు సంబంధించిన వీడియోను 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తాజాగా షేర్ చేశాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ పాడ్ కాస్ట్ సందర్భంగా అప్పటి వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. జనాలు మర్చిపోయిన ఈ ఘటనను లలిత్ మోడీ […]
సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లుంది సీఎం చంద్రబాబు వ్యవహారం అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పనిచేసేది ఒకరు, క్రెడిట్ పొందేది మరొకరు అని.. క్రెడిట్‌ని దొంగిలించగలగిన సమర్థుడు చంద్రబాబు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కుప్పం, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏరోజు రాలేదని.. బాబు ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసన్నారు. మాట ఇచ్చిన ప్రకారం వైఎస్ జగన్ కుప్పానికి నీళ్లు ఇచ్ఛారన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన […]
Women’s Safety Awareness program in AP: మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను, చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, ప్రతివారం విద్యార్థినిలకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో రాజమండ్రిలో జరిగిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమానికి డాక్టర్ శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. […]
Asia Cup 2025 Schedule Update: క్రికెట్ అభిమానులకు కీలక అప్డేట్. ఆసియా కప్ 2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు ఉండగా.. 18 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం అవుతాయి. సెప్టెంబరు 15న అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియంలో యూఏఈ, ఒమన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ టైమింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ మ్యాచ్ ముందు ప్రకటించినట్టుగానే రాత్రి 5.30కు ప్రారంభం […]
కోనసీమ తిరుమలగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ వ్యక్తి హాల్చల్ చేశాడు. ఆలయం లోపల గాలిలో పేల్చే డమ్మీ పిస్టల్‌తో అతడు హాల్చల్ చేయడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆలయ అధికారులు, పోలీసులు వెంటనే అప్రమత్తమై.. హడావుడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడి వద్ద నుంచి డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. డమ్మీ పిస్టల్ కలిగిన వ్యక్తి కృష్ణా జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నంకు చెందిన జానా వెంకట […]
కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 ఎంఓయూలు కుదిరాయి. కుప్పం పరిధిలో వ్యర్ధాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్-ఐటీసీతో ఒప్పందం కుదిరింది. వ్యర్ధాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందంజరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో 10వేల […]
వెస్టిండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో 14 వేలకు పైగా పరుగులు, మూడు వందల వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో భాగంగా ఈరోజు ఉదయం బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పొలార్డ్ ఈ ఫీట్ అందుకున్నాడు. మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు. […]
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆర్ఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తాము ఆఫర్ చేసిన పదవిని ద్రవిడ్ వద్దన్నారని తెలిపింది. ఆర్ఆర్కు సేవలు అందించినందుకు ధన్యవాదాలు చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ద్రవిడ్ రాజస్థాన్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అతడు […]