రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ వేములవాడ లో 300 MTS గోదాం, Kdccb వేములవాడ శాఖ నూతన భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. 2009 లో కరీంనగర్ ఎమ్మెల్యే కావాలని అనుకున్న వైఎస్ఆర్ ఎంపీగా పోటీ […]
చెరువుల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై హరీష్ రావుతో ఓ కమిటీ వేద్దాం.. అక్రమ నిర్మాణాలు దగ్గర ఉండి కూల్చివేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేము చేస్తున్న మంచి పనులు చూసి పార్టీలోకి వస్తాం అంటున్నారు. భయపెట్టి, బ్రతినిలాడి ఎవర్నీ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో కేస్ బై కేస్ విచారణకు సీబీఐకి అనుమతి ఇచ్చామన్నారు. వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన తెలిపారు. […]
తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరు? రాష్ట్ర పార్టీని పర్యవేక్షించాల్సింది ఎవరు? పర్యవేక్షిస్తోంది ఎవరు? ఢిల్లీ నాయకత్వం క్లారిటీగా చెప్పేసినా అసలా డౌట్ ఎందుకు వస్తోంది? ఇన్ఛార్జ్ పదవి కేంద్రంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? పార్టీ నాయకులు ఏమంటున్నారు? జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరన్న డౌట్ ఎందుకు వస్తోంది? పార్టీ జాతీయ వెబ్ సైట్లో చూస్తే…అభయ్ పాటిల్ అని ఉంది. ఢిల్లీలో జరిగిన మెంబర్షిప్ డ్రైవ్ వర్క్ షాప్‌కు రాష్ట్ర […]
ఆ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారా? ఇంకా మాట్లాడితే… అసలు జిల్లా నుంచే బహిష్కరించేలా పావులు కదుపుతున్నారా? గడిచిన ఐదేళ్ళలో ఆయన, అనుచరులు చేశారని చెబుతున్న అరాచకాల చిట్టా తీసి చట్టపరంగా ఎక్కడికక్కడ నట్లు బిగించాలనుకుంటున్నారా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటా రివెంజ్ పాలిటిక్స్? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గతం ఇప్పుడు వెంటాడుతోందా అంటే… అవునన్నదే నియోజకవర్గంలోని రాజకీయ వర్గాల మాట. ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరైన తాడిపత్రిలో […]
రాష్ట్రంలోని హైడ్రా ఏజెన్సీ అక్రమ ఆక్రమణలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న డ్రైవ్‌ల మధ్య, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఫ్లోర్ లీడర్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తాను స్థాపించిన సంస్థల కూల్చివేతకు వాదిస్తున్న వారిని విమర్శించారు. అక్బరుద్దీన్ ఒవైసీ విద్యార్థులకు అందించే నైపుణ్యాలు, విద్య కొంతమందిలో “అసూయను రేకెత్తిస్తున్నాయి” అని నొక్కిచెప్పారు, వారు నిరుపేదలను ఉద్ధరించడానికి తన ప్రయత్నాలను అణగదొక్కాలని నిర్ణయించుకున్నారు. ఒవైసీ అక్రమ భూమిని ఆక్రమించాడా అనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ, రాజేంద్రనగర్‌లోని బం-రుక్న్-ఉద్-దౌలా […]
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎంపీ డీకే.అరుణ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని, రుణమాఫీ ఒక మోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులలో 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఆమె వ్యాఖ్యానించారు. నిబంధనల పేరుతో రైతులను అయోమయానికి గురిచేసి ఇంట్లో ఒకరికే రుణమాఫీ చేస్తామంటూ రేషన్ కార్డు […]
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మన రాష్ట్రం నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎక్కువ మంది ఎంపిక అవ్వాలన్నారు. వాళ్లకు ఆర్థిక ఇబ్బంది నీ కొంతైనా తగ్గించాలని లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, లక్ష […]
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపటి నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్టు 27న యాదాద్రి ఆలయం దర్శించుకోనున్న ఆయన, అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లాకు చేరుకుంటారు..ములుగు జిల్లాలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు. యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా ఖండం రామప్ప ఆలయాన్ని వీక్షించి లక్నవరంకు వెళ్లనున్నారు. రాత్రి లక్నవరం లో బస చేసి మరుసటి రోజు హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో […]
ఎల్బి స్టేడియంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ ను , టీ షర్ట్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ […]
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన డేటా ప్రకారం. జనవరి 1వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు 5372 కేసులు నమోదయ్యాయి. అయితే.. హై రిస్క్ డెంగ్యూ కేసులు హైద్రాబాద్ లో 1,852 నమోదు కాగా.. సూర్యాపేట 471, మేడ్చల్ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్గొండ 315, నిజామాబాద్ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, […]