కులబలం, ధనబలం, పొలిటికల్ ట్రాక్ రికార్డు.. ఈ లెక్కలన్నీ వేసినా.. ఓ పాతిక ముప్పయ్ కోట్లు చేతిలో ఉండాల్సిందే! ఆ మాత్రం బరువు లేనిదే ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదు! ఈ సంగతి అందరికీ తెలుసు. అలాంటి సినారియోలో ఓ ఇద్దరికి సామాన్యులకు టికెట్స్ ఇచ్చారా అధినేత. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇద్దరూ ఓడిపోయారు! తర్వాత మాయమయ్యారు! ప్రయోగం వికటించినా ఇంతవరకు విరుగుడు మంత్రమేంటో అధినేత చెప్పడం లేదట. Off The Record […]
ఆ నియోజకవర్గంలో దశాబ్దాలుగా టీడీపీకి ప్రత్యామ్నాయం ఆ నాయకుడే. కాంగ్రెస్ నుంచి ఒకసారి, వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు లెక్క తప్పింది! అనుచరగణమంతా గుడ్ బై చెప్పి పోతున్నారు. ఎందుకలా అంటే సౌండ్ లేదు! కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం. నియోజకవర్గంలో 1994 నుంచి ఇద్దరు నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. మూడు దశాబ్దాలుగా ఇద్దరిదే హవా అక్కడ. అయితే మీనాక్షి నాయుడు. లేదంటే వై. సాయిప్రసాదరెడ్డి. 2004 వరకు కాంగ్రెస్లో ఉన్న సాయిప్రసాదరెడ్డి […]
అధికారంలో ఉన్నప్పుడు ఆ అవసరం రాలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక అక్కెరకొచ్చింది. అందుకే సెట్ చేసే పనిలో పడ్డారు. రండి బాబూ రండి.. కార్యకర్తలను ఉత్తేజపరిచే పనిలో పడ్డారట. దసరా తర్వాత గులాబీశిబిరంలో పందేరమే అంటున్నారు. డిసెంబర్లో గులాబీ బాస్ ఫాంహౌజ్ వీడుతారని చెబుతున్నారు! కాంగ్రెస్ ప్రభుత్వానికి యేడాది టైం ఇచ్చిన తర్వాత ఎటాక్ చేద్దామనే వ్యూహంలో బీఆర్ఎస్ ఉందట! ఆ క్రమంలోనే పార్టీ రూట్ లెవల్లో సెట్ చేద్దామనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడాని ఎదురు […]
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాత్రి నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి కార్యదర్శులు విశ్వనాథ్, విశ్వనాథం లతోపాటు నాలుగు జిల్లాల సంబంధించిన మంత్రులు, ఎంపీలు, […]
ప్రపంచవ్యాప్తంగా లైంగిక దాడులకు బలవుతున్న 37 కోట్ల మంది బాలికలు.. ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మందికి పైగా బాలికలు మరియు మహిళలు తమ చిన్నతనంలో అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైనట్లు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. 18 ఏళ్ల లోపు ప్రతీ 8 మందిలో ఒక బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. పిల్లలపై లైంగిక హింసపై మొట్టమొదటిసారిగా ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో రిపోర్ట్ వెలుబడింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న బాలికలకు ఈ వేధింపులు […]
తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఈ కులగణనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శుక్రవారం సమగ్ర కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వేను ఇంటింటి కుటుంబాల రిజిస్ట్రేషన్ ద్వారా నిర్వహించనున్నట్లు జీవో విడుదల చేసింది. ఈ సర్వేను ప్రణాళికశాఖకు అప్పగిస్తూ, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Sayaji […]
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, షమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ […]
ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులను శనివారం సాయంత్రం లోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారిని చైర్మన్గా నియమించనున్నారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీకి పంచాయతీ […]
రాష్ట్ర ప్రభుత్వం, కోటీశ్వరుల పిల్లలకు అందించిన నాణ్యమైన విద్యను పేద పిల్లలకు అందించాలనే లక్ష్యంతో యువ భారత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా గంధంవారి గూడెంలో రూ.300 కోట్లతో నిర్మించబోతున్న ఈ పాఠశాల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైలాన్ ఆవిష్కరించి, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇంగ్లీష్, తెలుగు […]
ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది.. ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పాఠశాల స్కూల్స్ బాగుకోసం కోట్ల రూపాయాలు కేటాయించామన్నారు. ఇప్పటికీ వున్న ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షన్సియల్ స్కూల్స్ కొనసాగిస్తామన్నారు. ఏవి కూడా ముసేసిది లేదన్నారు. అన్నింటికీ శాశ్వత భవనాలు కల్పిస్తామన్నారు. అడ్డంకులు సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఉడుత ఊపులకు ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఎవరు […]