TGSRTC : టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
- టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
- రెగ్యులర్ సర్వీస్‌లకు సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయి
- స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం చార్జీలను సంస్థ సవరించింది :టీజీఎస్ఆర్టీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : టీజీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ ధరలను పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. రెగ్యులర్ సర్వీస్‌లకు సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయని, దీపావళి తిరుగు ప్రయాణ రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం చార్జీలను సంస్థ సవరించిందని టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఆ బస్సులు ఖాళీగా వెళ్తుంటాయి. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. గత 21 ఏళ్లుగా అనవాయితీగా వస్తోన్న ప్రక్రియ ఇది. దీపావళి పండుగ సమయంలో రెగ్యులర్ సర్వీసుల ద్వారానే ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చడం జరిగింది. కానీ తిరుగు ప్రయాణంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి రద్దీ ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆది, సోమవారం నాడు రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఆదివారం నాడు కరీంనగర్ రీజియన్ నుంచి 127, రంగారెడ్డి నుంచి 105, వరంగల్ నుంచి 66, ఆదిలాబాద్ నుంచి 16 మొత్తంగా 360 ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌కు సంస్థ నడిపింది. సోమవారం సాయంత్రం వరకు ఆయా ప్రాంతాలనుంచి మరో 147 సర్వీసులను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం చార్జీలను సవరించడం జరిగింది. ఈ బస్సులు మినహా మిగతా బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయి. స్పెషల్ సర్వీసుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలను సవరించడం జరుగుతుందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తుంది. సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే ఉంటాయి. స్పెషల్ సర్వీసులకు టికెట్ ధరలను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోంది.’ అని టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది.
Also Read
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
తాజావార్తలు
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!