ఆయుర్వేదంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. భారతీయ సంస్కృతిలో, మహిళలు తెల్లవారుజామున తులసిని పూజిస్తారు. ఈ మొక్క అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది, అందువల్ల దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను నాటడం ఆనందం , శ్రేయస్సు సూచకంగా భావించబడుతుంది. స్త్రీలు తమ ఇంటి ఆవరణలో తులసిని పూజించడం సంప్రదాయంగా ఉండి, ఈ మొక్కపై వేదాలలో వివరణలు కూడా ఉన్నాయి. తులసి కథ చంద్రప్రకాష్ ధన్‌ధన్ పేర్కొన్నట్లు, గత జన్మలో తులసి […]
ఒత్తిడి , డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో ప్రజల జీవితాలను వేగంగా తినేస్తున్న తీవ్రమైన మానసిక వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 15-29 సంవత్సరాల వయస్సు గల యువతలో మరణానికి రెండవ ప్రధాన కారణం. అయినప్పటికీ, ప్రజలు తరచుగా దాని ప్రారంభ లక్షణాలను గుర్తించలేరు, ఇది నిరాశను మరింత ప్రమాదకరంగా చేస్తుంది. ఫోర్టిస్ […]
గుడికి, బడికి, పెళ్లికి, చావింటికి వెళ్లేటప్పుడు దుస్తుల ఎంపిక విషయంలో చాలా మందికి సరైన అవగాహన లేకపోతుంది. ఈ నేపథ్యంలో, కోల్ కతాకు చెందిన మోడల్ హేమో శ్రీ భద్ర , ఆమె ఇద్దరు స్నేహితులు, దుర్గామాత దర్శనానికి వెళ్లి విభిన్నమైన, అభ్యంతరకర దుస్తులు ధరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వారు అమ్మవారి మండపంలో ఉన్నప్పుడు, ఫోటోలకు ఫోజులు ఇచ్చారు, దీనిపై భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ దుర్గా పూజ వేడుకలు కోల్ కతాలో చాలా వైభవంగా జరుగుతున్నాయి. […]
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో 18ను తీసుకొచ్చారని వివరించారు. ఈ సర్వే 60 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణనను పూర్తిగా సేకరించిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (గ్రామ్ పంచాయతీ ఎన్నికలు) జరుగుతాయని స్పష్టత ఇచ్చారు. కులగణన ప్రక్రియలో రాష్ట్ర ప్రజలు […]
చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగలైన దసరా, దుర్గాపూజలను దేశం జరుపుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి తన అధికారిక X హ్యాండిల్లో పోస్ట్‌లో ఇలా అన్నారు, “అందరికీ ‘విజయదశమి’ శుభాకాంక్షలు. అధర్మం యొక్క చీకటి ఎంత దట్టమైనప్పటికీ, సత్యం ఆధారంగా ధర్మం యొక్క కాంతి విజయం శాశ్వతమైనది. “దానికి ప్రతీక. పాపంపై పుణ్యం సాధించిన ‘విజయదశమి’ అనేది మనల్ని ఎల్లప్పుడూ వివేకం , సత్యం యొక్క […]
కేంద్ర మంత్రి బండి సంజయ్, తాను వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి విషయంలో మాత్రం రాజీలేకుండా పనిచేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయానికి విచ్చేశారు. ఆలయ నిర్వాహకులు పొన్నంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకుని […]
2019 ఎన్నికల్లో పడమరలో ఫ్యాన్ ఫుల్ స్పీడులో తిరిగింది! ఇప్పుడు ఒకటో నంబర్లో పెట్టినట్టుగా ఉంది! రెక్కలుగా ఉన్నవాళ్లంతా సైడయ్యారు! గాలిరాక కేడర్ ఉక్కిరిబిక్కిరవుతోంది! గ్రంధి రందితో పక్క చూపులు చూస్తున్నారని నియోజకవర్గంలో టాక్. ఆచంట లీడర్ ఏచెంత ఉన్నారో తెలియక అయోమయం! ఆళ్ల కాళీ కృష్ణ వెళ్లిపోయాక ఆ ప్లేస్ ఇంకా ఖాళీగానే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో నరసాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు చాలా కీలకమైనవి. ఇక్కడి ఓటర్లు ఎప్పుడూ వన్ సైడ్‌గా గెలుపును […]
కులబలం, ధనబలం, పొలిటికల్ ట్రాక్ రికార్డు.. ఈ లెక్కలన్నీ వేసినా.. ఓ పాతిక ముప్పయ్ కోట్లు చేతిలో ఉండాల్సిందే! ఆ మాత్రం బరువు లేనిదే ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదు! ఈ సంగతి అందరికీ తెలుసు. అలాంటి సినారియోలో ఓ ఇద్దరికి సామాన్యులకు టికెట్స్ ఇచ్చారా అధినేత. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇద్దరూ ఓడిపోయారు! తర్వాత మాయమయ్యారు! ప్రయోగం వికటించినా ఇంతవరకు విరుగుడు మంత్రమేంటో అధినేత చెప్పడం లేదట. Off The Record […]
ఆ నియోజకవర్గంలో దశాబ్దాలుగా టీడీపీకి ప్రత్యామ్నాయం ఆ నాయకుడే. కాంగ్రెస్ నుంచి ఒకసారి, వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు లెక్క తప్పింది! అనుచరగణమంతా గుడ్ బై చెప్పి పోతున్నారు. ఎందుకలా అంటే సౌండ్ లేదు! కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం. నియోజకవర్గంలో 1994 నుంచి ఇద్దరు నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. మూడు దశాబ్దాలుగా ఇద్దరిదే హవా అక్కడ. అయితే మీనాక్షి నాయుడు. లేదంటే వై. సాయిప్రసాదరెడ్డి. 2004 వరకు కాంగ్రెస్‌లో ఉన్న సాయిప్రసాదరెడ్డి […]
అధికారంలో ఉన్నప్పుడు ఆ అవసరం రాలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక అక్కెరకొచ్చింది. అందుకే సెట్ చేసే పనిలో పడ్డారు. రండి బాబూ రండి.. కార్యకర్తలను ఉత్తేజపరిచే పనిలో పడ్డారట. దసరా తర్వాత గులాబీశిబిరంలో పందేరమే అంటున్నారు. డిసెంబర్లో గులాబీ బాస్ ఫాంహౌజ్ వీడుతారని చెబుతున్నారు! కాంగ్రెస్ ప్రభుత్వానికి యేడాది టైం ఇచ్చిన తర్వాత ఎటాక్ చేద్దామనే వ్యూహంలో బీఆర్ఎస్ ఉందట! ఆ క్రమంలోనే పార్టీ రూట్ లెవల్లో సెట్ చేద్దామనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడాని ఎదురు […]