KTR : ఫార్ముల ఈ కార్ రేస్ కేసులో హైకోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని కోరుతూ లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే… కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. సీసీ టీవీ పర్యవేక్షణలో కేటీఆర్ […]
No More Kingfisher Beers : తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్ ప్రియుల గుండె పగిలిపోయే విషయం ఇది. కింగ్‌ఫిషర్ బ్రాండ్ బీర్ తయారీదారులైన యునైటెడ్ బ్రేవరీస్ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కి ‘గణనీయమైన , కొనసాగుతున్న ఆపరేటింగ్ నష్టాల’ కారణంగా తక్షణమే అన్ని బ్రాండ్ల కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. బీర్ తయారీదారు గత నాలుగు సంవత్సరాలుగా నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, దాని ఉత్పత్తులకు అందించే బేస్ ధరలలో పెరుగుదల లేదని పేర్కొంది. “ఇది […]
HYDRA : హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఫోకస్ పెట్టారు. తుర్కయాంజల్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. చెరువు తూములు మూసేసి అలుగు పెంచడంతో చెరువుపై భాగంలో పంటపొలాలు, ఇళ్ళు నీట మునుగుతున్నాయని స్థానికులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు హైడ్రా కమిషనర్. తుర్కయాంజల్ చెరువు FTL పైన వచ్చిన ఫిర్యాదులపై ఏవీ రంగనాధ్ పరిశీలన చేశారు. […]
Kushboo: కోలీవుడ్ హీరో అయినప్పటికి టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయంగ్ సంపాదించుకున్న నటుడు విశాల్. ఈయన తమిళంలో నటించిన ప్రతి ఒక సినిమాలు తెలుగులో కూడా అదే స్థాయిలో విజయాలు అందుకున్నాయి. ఇక ఎప్పుడు ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే విశాల్ ఇటీవల తన సినిమా వేడుకలో హాజరయ్యాడు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. Game Changer : రూమర్లకు చెక్.. “గేమ్ ఛేంజర్” కర్ణాటక బుకింగ్స్ […]
Harish Rao : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచినట్లు గుర్తు చేస్తూ, ఉద్యమకాలపు జ్ఞాపకాలు తాజా డైరీలో ఉంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యం నేటి డైరీ ఆవిష్కరణ […]
Highcourt Telangana : హైదరాబాద్ అంబర్ పేట్‌లోని బతుకమ్మ కుంటపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు బతుకమ్మ కుంటను ప్రభుత్వమిదేనని స్పష్టం చేసింది. ఈ స్థలాన్ని తమదని, బతుకమ్మ కుంటపై హైడ్రా చర్యలకు స్టే విధించమని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు 2025 జనవరి 7వ తేదీన తుది తీర్పు ఇచ్చింది. Squid Game Viral Video: ‘స్క్విడ్‌గేమ్’లో టాలీవుడ్ స్టార్ […]
Thatikonda Rajaiah : ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదనడం కడియం దివాలాకోరుతనమని తాటికొండ రాజయ్య మండిపడ్డారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను.. కడియం శ్రీహరి ప్రారంభించడం సిగ్గుచేటని, కడియం మాటలు..అబద్దాల మూటలు అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఘనపూర్ కు ఇరిగేషన్ పనులు మంజూరయ్యాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియంను గెలిపిస్తే..రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, సక్రమ […]
Satyavathi Rathod: ఫార్ముల ఈ రేస్ కారు వ్యవహారంపై బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని ఆమె విమర్శించారు. కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమకేసు అని, 1992లో ఈ కార్ రెస్ నిర్వహించాలని చంద్రబాబు ప్రయత్నించినా.. ఇంతవరకూ ఎవరూ ఈ రేస్ ను తీసుకురాలేదన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో […]
గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. స్కూల్లోనే కుప్పకూలిన చిన్నారి.. ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారికి వస్తుందని అనుకునే వాళ్లం. కానీ, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా రావడం ఆందోళనలు పెంచుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో యుక్త వయస్కులు గుండెపోటుకు గురై మరణించారనే వార్తలు వింటూనే ఉన్నాం. చివరకు స్కూల్ పిల్లలు మరణించడం సమస్య తీవ్రతను పెంచుతోంది. ఈ దాడి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ ప్లానే ఇవాళ బీజేపీ కార్యాలయంలోపై కాంగ్రెస్ శ్రేణులు […]
HYDRA : హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్ఠ చర్యలకు దారితీసింది. ఈ క్రమంలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్ భవనంలోని B-బ్లాక్‌లో ఈ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రాకు విస్తృతమైన అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నగరంలోని […]