DCP Vineeth : గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో చోటు చేసుకున్న కాల్పుల ఘటన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో ప్రిజం పబ్బుల్లో మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ ఉన్నాడు అని సమాచారం అందిందన్నారు. నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతను పోలీసులపై కాల్పులు జరిపాడని, దీంతో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కాలికి బుల్లెట్ గాయం అయిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు తుపాకులు సీజ్ చేశామని, 23 రౌండ్లు బుల్లెట్స్ సీజ్ చేశామన్నారు. బత్తుల ప్రభాకర్ ను విచారించామని, అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇంట్లో తనిఖీలు చేశామని ఆయన పేర్కొన్నారు. 451 లైవ్ బుల్లెట్లు రౌండ్లు దొరికాయన్నారు. ప్రభాకర్ చిత్తూరు జిల్లాకు చెందిన వాడని, 2013 నుండి నేరాలు మొదలు పెట్టాడు. సోలో గా దొంగతనాలు చేస్తున్నాడన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 కేసులో నిందితుడు ..23 కేసులో వాంటెడ్ గా ఉన్నాడని, తెలంగాణలో 11 కేసులో, ఆంధ్ర ప్రదేశ్ లో 12 కేసుల్లో నిందితుడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలో నేరాలకు పాల్పడ్డాడని, 2022 లో జైలు నుండి పారిపోయాడు..అప్పటి నుండి ఏపి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడని డీసీపీ వినీత్ తెలిపారు. ఇళ్ళల్లో చోరీ చేయడం రిస్క్ అని శివార్లలో ఉండే విద్యాలయాల్లో చోరీలు చేస్తున్నాడని, దొంగతనం చేసే ముందు రెక్కి చేస్తాడు.. అరిలోవా పోలీస్ కస్టడీ అని, యుట్యూబ్ పోలీసులకు చిక్కకుండా. ఎలా తప్పించుకోవాలి అని వీడియోలు చూస్తాడన్నారు.
U19 Womens T20 World Cup: అండర్-19 భారత్ మహిళల జట్టుకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు..
2020లో విశాఖ లో అరెస్టు అయ్యాడని ఆయన పేర్కొన్నారు. ఆ కేసులో భాగంగా జైల్లో ఉన్నపుడు ఒక ఖైదీ ప్రభాకర్ ను హారాష్ చేసాడని, అతన్ని చంపాలని గన్ కొనుగోలు చేశాడు..జైల్లో పరిచయం ఖైదీలు సహకారంతో బీహార్ లో గన్ కోనుగోలు చేశాడని ఆయన తెలిపారు. గన్ కొనుగోలు చేయడానికి, నేరాలు చేయడానికి ఎవరెవరు సపోర్ట్ చేసారో వారందర్నీ అరెస్టు చేస్తామన్నారు. పట్టుబడితే తప్పించుకోవడానికినేరం చేసే ప్రతి సమయంలో గన్ వాడుతాడని, 66 కేసులో అరెస్టు అయ్యాడు… 8 నెలల క్రితం నుండి తుపాకులు వాడుతున్నాడన్నారు. పీజీ హాస్టల్లో ఉంటాడు లేదా తెలిసిన ఫ్రెండ్స్ తో ఉంటాడని, ప్రస్తుతం ఒక అపార్ట్మెంట్ లో ఫ్రెండ్ పేరుతో రూమ్ తీసుకుని ఉంటున్నాడని ఆయన తెలిపారు. దొంగతనాలు చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడని, వాంటెడ్ గా ఉన్నా 21 కేసులో విద్యాలయల్లో దొంగతనం చేసిన కేసులు ఉన్నాయన్నారు. మూడు తుపాకులు, నాలుగు మ్యాగజీన్లు, 451 రౌండ్లు బుల్లెట్లు, 62 వేలు సీజ్ చేశామని, మొబైల్ తో పాటు చోరికి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ వినీత్.
Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం.. గూండాయిజం చేస్తోందని ఆరోపణలు!