ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య పేరు.. షాకిచ్చిన ఈడీ.. కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్‌లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్ కేటాయింపులు వంటి పెద్ద […]
తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా నూతన ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్ గంజ్‌లో ఉండగా.. నూతన ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. […]
Etela Rajender : తెలంగాణలో మూడో వంతు జనాభాను జీహెచ్ఎంసీ పాలిస్తుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస మారింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సంకుచితత్వానికి పోకుండా అవసరమైన చోట నిధులు ఇవ్వాలన్నారు. నగరంలోని కనీస సౌకర్యాలకు నోచుకొని ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ ఎంత, ఖర్చులు, రాబడి అనేది పక్కన పెట్టి సమస్యలపై దృష్టి పెట్టకపోతే నగరం మసకబారుతుందని ఆయన అన్నారు. […]
CM Revanth Reddy : ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో పాఠశాల విద్యను మరింత నాణ్యతా ప్రమాణాలతో అందించడానికి గాను ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ( ఏ.ఐ ), డిజిటల్ ఇనీషియేటివ్స్ లను పాఠశాల విద్య శాఖ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. విద్యార్థులలో మరింత మెరుగైన అభ్యాస పద్దతులను, సాంకేతిక ప్రమాణాలను పెంపొందించడం లాంటి వినూత్న […]
No Tax State : ప్రతి సంవత్సరం సమర్పించే కేంద్ర బడ్జెట్లో, అందరి దృష్టి పన్నులపైనే ఉంటుంది. ప్రభుత్వం పన్నులు తగ్గించడం ద్వారా ప్రజలకు కొంత ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రతి సంవత్సరం బడ్జెట్లో దీనికి సంబంధించి పెద్ద ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పన్నుగా చెల్లిస్తారు, కానీ భారతదేశంలో ప్రభుత్వం పన్ను వసూలు చేయని రాష్ట్రం ఉంది. భారతదేశంలో పన్నులు చెల్లించాల్సిన […]
హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము! తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, […]
GHMC Council : జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం ఆరంభమైన కొద్దిసేపట్లోనే రసాభాసగా మారింది. మేయర్ ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించగా, దీనికి బీఆర్ఎస్ (BRS) , బీజేపీ (BJP) కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై కాకుండా, ప్రజా సమస్యలపై మొదట చర్చించాలనే డిమాండ్‌తో ఈ రెండు పార్టీల కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు […]
Betting Apps : నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉప్పెనలా పెరిగిపోతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇన్ఫ్లుఎన్సర్లు వీటిని తెగ ప్రమోట్ చేస్తూ, అమాయక ప్రజలను మోసపూరితంగా ఆకర్షిస్తున్నారు. అయితే, ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేయడం భారతదేశ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసలై ఎంతో మంది తమ సంపదను కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోతున్నారు. కుటుంబ పోషణ కష్టమవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, విడాకులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా […]
Telangana : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా, ఆయా వర్గాల విద్యార్థుల ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల మినహాయింపు అందజేశారు. దివ్యాంగుల హక్కుల చట్ట నిబంధనల ప్రకారం, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. Kajal Aggarwal : సైలెంట్ గా సెట్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. లైనప్ మాములుగా లేదు దివ్యాంగులను మొత్తం ఐదు […]
MLC Kavitha : నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది ? చేతిలో ఎర్రబుక్కు పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు ? అని ఆమె […]