GHMC : హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సీరియస్ అయింది. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి అనుమతుల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలడంతో, సంబంధిత భవనానికి ఇచ్చిన అనుమతులను బల్దియా రద్దు చేసింది. అపార్ట్మెంట్ నిర్మాణంలో సెట్ బ్యాక్ లేకపోవడంతో పాటు, బారికేడింగ్, రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయకుండా సెల్లార్ తవ్వకాలు జరిపినట్టు విచారణలో స్పష్టమైంది. అంతేగాక, ఈ తవ్వకాలు GHMC అధికారుల అనుమతి లేకుండా జరిగినట్టు […]
Inter Board : తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి. […]
CM Revavnth Reddy : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డి (MCHRD)లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ (AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. […]
Konda Surekha : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనను విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం […]
Accident : పెద్దఅంబర్ పేట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రిత్విక అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. హయత్నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో రిత్విక LKG చదువుతోంది. అయితే.. రోజులాగే ఈ రోజు కూడా బాలిక బస్సు దిగింది. అయితే.. బాలిక దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ చేయడం ప్రమాదం చోటు చేసుకుంది. కుమార్తె మరణ వార్తతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి […]
Kunamneni Sambasiva Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బాబుక్యాంపు లోని రజబ్అలి భవన్ లో సింగరేణి.. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధుల తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ పై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణి లో ప్రైవేటు వ్యవస్థ లతో బొగ్గు ఉత్పత్తి యత్నాలను విరమించుకోవాలన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు బావుల మీద శ్రద్ధ చూపకుండా ప్రైవేట్ వ్యాపారల […]
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీతెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి మనసుని హత్తుకునే పాటలు,అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీతెలుగు పాపులర్ షో సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో కొనసాగుతున్నసరిగమప 16 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి ముఖ్య అతిథులుగా ఉత్కంఠగా సాగిన సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ […]
KTR : బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేసిన కేసును కూడా ఫాలోఅప్ చేయనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయంలో కోర్టులో పోరాడతామని, తమ పార్టీ నేతల బృందం న్యాయవాదులతో సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతేగాక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతీయ […]
Etela Rajender : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదాస్పద ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను ఫోన్ చేసి మళ్లీ కలిసి పని చేయాలని పిలిచారన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చిచెప్పారు. ‘‘నేనంటే గిట్టని వారు, సోషల్ మీడియాలో ఉండే సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు’’ అని ఖండించారు. తాను చాలా కాలంగా బీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో […]
Minister Seethakka : హైదరాబాద్ గాంధీ భవన్లో బుధవారం మంత్రి సీతక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినడం, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరై తమ వినతులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రజల వినతులను స్వీకరించడంతో పాటు, కొన్నింటిని సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె […]