స్వీడన్‌లోని ఓ స్కూల్లో కాల్పుల మోత.. 10మంది మృతి స్వీడన్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడ అంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది. కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 20 మంది వరకు గాయపడ్డారని […]
Bird Flu : తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతుండటంతో నిర్వాహకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్ మండలం చేతన్‌నగర్ శివారులో ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్‌లో గత రెండు రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జల్లాపల్లి గ్రామానికి చెందిన రవి చేతన్‌నగర్ శివారులో కోళ్ల ఫామ్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. అయితే, సోమవారం , మంగళవారం రోజుల్లోనే దాదాపు 5 వేల కోళ్లు అకస్మాత్తుగా […]
Caste Census : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. అయితే.. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. అయితే.. ఈరోజు సమగ్ర కులగణన సర్వేపైన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు […]
NTV Daily Astrology as on 5th February 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ. ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు చేయనున్న మోదీ. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్న మోదీ. అనంతరం ఢిల్లీకి మోదీ తిరుగు ప్రయాణం. నేడు బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్. హాజరుకానున్న స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఢిల్లీలోనే మంత్రి నారా లోకేష్. నేడు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామిని నారా లోకేష్ కలిసే అవకాశం. […]
Uttam Kumar Reddy : తెలంగాణ కులగణన సర్వేలో బీసీ జనాభా తగ్గిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సర్వేలో ముస్లిం బీసీలను కలిపిన తర్వాత బీసీ జనాభా 51 శాతంగా ఉన్నట్లు చూపించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన తాజా కులగణన సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్వేలో బీసీ […]
Fire Accident : హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫేస్-1 ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. కెమికల్ ఫ్యాక్టరీలో రసాయనాల వల్ల మంటలు మిన్నంటడంతో వాటి ప్రభావం చుట్టుపక్కల పరిశ్రమలకు విస్తరించింది. సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీలో మొదలైన మంటలు సమీపంలోని ఇతర పరిశ్రమలకు వ్యాపించాయి. ముఖ్యంగా పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో పరిస్థితి మరింత […]
మా లక్ష్యం వికసిత్ భారత్.. అందుకే ప్రజలు మూడోసారి ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. దేశ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఆత్మ విశ్వాసం నింపిందని.. అంతేకాకుండా ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం […]
Fraud : నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిందితుడు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్.. 2020లో ఆర్ సి ఇన్ఫ్రా, ట్రై కాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభించాడు. 24 మంది ఏజెంట్లతో […]
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేవపెట్టారు. అయితే.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ […]