రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం! రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ […]
Vijayawada-Hyderabad Highway: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట సమీపంలోని గొల్లగట్టుపై ప్రఖ్యాత పెద్దగట్టు జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతర ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పెద్దగట్టు జాతరను ప్రధానంగా యాదవ సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంది. అయితే, ఈ ఉత్సవానికి యాదవులతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి […]
HMWSSB : హైదరాబాద్ మహానగర జలమండలి (HMWSSB) గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 18న (మంగళవారం) ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి. ఈ సమయంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. పంపింగ్ స్టేషన్ వద్ద చేపట్టనున్న పనులు: 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900 […]
TPCC Mahesh Goud : మహేశ్వరం గట్టుపల్లిలో తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువ క్రాంతి బూనియాది ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం యూత్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు టీపీసీసీ చీఫ్. మూడు రోజుల పాటు శిక్షణ శిబిర కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. […]
Jagga Reddy : బీజేపీ నేతలు.. బండి సంజయ్ లాంటి వాళ్ళకు అవగాహన కోసం కొన్ని విషయాలు చెప్పాలన్నారని, రాహుల్ గాంధీ అంటే చరిత్ర.. మహా సంగ్రామం నుండి వచ్చిన చరిత్ర ఆయన కుటుంబం ది అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ.. ఆయన కుటుంబం గురించి బండి సంజయ్ మాట్లాడారని, అవగాహన ఉండి మాట్లాడారో లేకుండా మాట్లాడారో మరి అంటూ జగ్గారెడ్డి విమర్శించారు.. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు అని, వాళ్ళు హిందువులు.. […]
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి దాదాపుగా ఖరారైందా? కేబినెట్ ర్యాంక్‌తో ఆయన్ని గౌరవించాలని అనుకుంటున్నారా? కానీ… ఆయన మాత్రం ఆ కొత్త పోస్ట్‌తో అంత సంతృప్తిగా లేరా? అసలు పార్టీ ఏం ఆఫర్ చేసింది? ఆ విషయంలో కూడా ఎమ్మెల్యే ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? దాని మీద కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటు చివరికి పీసీసీ పోస్ట్‌ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం నడుస్తూనే […]
Harish Rao : జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మరింత వృద్ధి చెందేలా చేయూత ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తే “చోటి సోచ్” అని అవమానించడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.ఈ వ్యాఖ్యలు గౌరవ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటి సోచ్ కి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలి. సెస్సులు, సర్ […]
కామ్రేడ్స్… కాంగ్రెస్ మీద అలిగారా? అంతా మీ వల్లే… అంటూ నిందిస్తున్నారా? దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అగ్గికి ఆజ్యం పోసిందా? తెలంగాణ కామ్రేడ్స్ కూడా మేము సైతం అంటూ… ఓ పుడక వేసేస్తున్నారా? అసలిప్పుడు కమ్యూనిస్ట్‌లు ఏమనుకుంటున్నారు? జరుగుతున్న చర్చ ఏంటి? రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్, ఎన్నో ప్రాధాన్యతల నడుమ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్న ఇండియా కూటమి వ్యవహారం నానాటికీ తీసికట్టు అన్నట్టుగా మారుతోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మిత్ర […]
గన్నవరం తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీ ఆఫీస్‌ని తగలబెట్టిన కేసులో సీన్ ఎందుకు రివర్స్ అయింది? అధికారంలో ఉండి కూడా ఫిర్యాదు దారుడిని కాపాడుకోలేకపోయారా? టీడీపీ పెద్దలు వల్లభనేని వంశీని లైట్ తీసుకుని బోల్తా పడ్డారా? గన్నవరం గరం గరంకు కారకులెవరు? ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజక వర్గాల్లో గన్నవరం ఫస్ట్ లిస్ట్‌లో ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ… 2019- […]
ఆ జూనియర్ మంత్రికి తత్వం బోధపడడం లేదా? పార్టీ, ప్రభుత్వం లైన్‌ను అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డారా? అనుకోకుండా వచ్చిన, చాలా మంది జూనియర్స్‌కు కలగానే మిగిలిపోయిన అవకాశాన్ని ఆయన చేజేతులా పాడు చేసుకుంటున్నారా? మినిమం పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారని చర్చ జరుగుతున్న ఆ మంత్రివర్యులు ఎవరు? ఆయన సమస్య ఏంటి? వాసంశెట్టి సుభాష్, ఏపీ కార్మిక శాఖ మంత్రి. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచారు.సామాజిక సమీకరణల కోణంలో మంత్రిగా […]