Harish Rao : తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల్లో అర్హతలపై, సమాచారంలో తేడాలు ఉన్నాయని పేర్కొంటూ చక్రధర్ గౌడ్ అనే అభ్యర్థి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్లో, నామినేషన్ దాఖలు సమయంలో హరీష్ రావు తమ ఆస్తుల వివరాలు సరిగా వెల్లడించలేదని, ఈ విషయంలో ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని ఆరోపించారు. Sonam Raghuwanshi: పెళ్లైన 4 […]
Janmabhoomi Express : తెలంగాణలో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. నల్లగొండ రైల్వే స్టేషన్ వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఆ రైలు ఇంజిన్ ఫెయిలవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంజిన్ స్టేషన్ చేరుకున్న తర్వాతే పనిచేయకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణంలో ఆగి ఉంటే విషయం ఇంకా పెద్ద ప్రమాదంగా ఉండేదని అంటున్నారు. Cyber Fraud : సుప్రీంకోర్టు జస్టిస్‌ను కూడా వదలని కేటుగాళ్లు.. నకిలీ కోర్టు సృష్టించి, నకిలీ జడ్జిని […]
Cyber Fraud : సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు వినిపిస్తూ నకిలీ కోర్టు డ్రామాతో ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను మోసం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఓ వీడియో కాల్ వచ్చింది. […]
నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటించగా .. లయ, వర్షా బొల్లమ్మ, స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్ర పోషించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ […]
Murder : హైదరాబాద్ శివారులోని మణికొండలో తప్పిపోయిన వృద్ధురాలి మిస్టరీకి తెరపడింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన బాలమ్మ అనే వృద్ధురాలి అదృశ్యంపై జరిగిన విచారణ దారుణ హత్యను బయటపెట్టింది. వృద్ధురాలిపై అత్యాశ పెంచిన మరో మహిళ ప్రణాళికాబద్ధంగా హత్య చేసిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 3న వాకింగ్‌కు వెళ్లిన బాలమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కోడలు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలమ్మతో సన్నిహిత సంబంధాలు ఉన్న అనిత […]
CM Revanth Reddy : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశమై మంత్రుల శాఖలపై చర్చించినట్టు తెలుస్తోంది. Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న […]
ఏలూరు: నేడు పోలవరం ప్రాజెక్టకు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉదయం 9 గంటలకు డయాఫ్రంవాల్ నిర్మాణ పనుల పరిశీలన. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, ఏజేన్సీలతో మంత్రి సమీక్ష. నేడు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్ర ఎండలు ఉండే ఛాన్స్. నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు. […]
NTV Daily Astrology as on June 10th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాలు మీకోసం.. మేష రాశి : ఈ రోజు మేషరాశివారికి ఉత్సాహం, […]
TGSRTC : తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచినట్టు తెలుస్తోంది. […]
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఓపెన్ కోర్ట్‌లో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్, హరీష్ రావును సుమారు 40 నిమిషాల పాటు విచారించింది. ప్రారంభంలో ఆయనను “నిజాలే చెప్తానని” ప్రమాణం చేయించి ప్రశ్నల వర్షం మొదలుపెట్టింది. కమిషన్ ప్రశ్నలు vs హరీష్ రావు సమాధానాలు కమిషన్: ఇరిగేషన్ మంత్రిగా మీరు ఎన్ని రోజులు పనిచేశారు? హరీష్ రావు: నేను సుమారు […]