విదేశి పర్యటనలో ప్రధాని మోడీ. నేడు, రేపు కెనడాలో పర్యటించనున్న మోదీ. జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ. నిన్న సైప్రస్ అధ్యక్షుడు నికోస్‌తో మోడీ భేటీ. వాణిజ్యం, పెట్టుబడి అంశాలపై చర్చించిన మోదీ. నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. ఈ నెల 21న యోగా డే సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన. మంత్రుల కమిటీ, అధికారులతో చర్చించనున్న చంద్రబాబు. బీచ్ రోడ్లో ఏర్పాట్లను పరిశీలించనున్న చంద్రబాబు. నేడు తెలంగాణలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం. వ్యవసాయ […]
NTV Daily Astrology as on June 16th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
R.S Praveen Kumar : తెలంగాణలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని బీఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారని, అలాంటి నేతపై కుట్రపూరితంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు కేటీఆర్‌పై 14 కేసులు పెట్టారని, इनमें నాలుగు కేసులను ఇప్పటికే హైకోర్టు […]
Harish Rao : ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని మూడు దశల్లో బనకచర్ల వరకు తరలించేందుకు కేంద్రానికి PFR సమర్పించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు […]
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఆయనను జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరారు. ఇదే కేసులో ఇది కేటీఆర్‌కు రెండోసారి నోటీసులు కావడం గమనార్హం. ACB ఇప్పటికే మే 26వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ, కేటీఆర్ అప్పటికే విదేశీ పర్యటనలో ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోయారు. […]
బోయింగ్ 787 నిర్వహణలో తమ ప్రమేయం లేదు.. టర్కీ స్పష్టికరణ..! అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి టర్కిష్ టెక్నిక్ ఎయిర్ ఇండియాతో నిర్వహణ ఒప్పందాన్ని కలిగి ఉన్నప్పటికీ.. అది బోయింగ్ 777 వైడ్-బాడీ విమానాలకు మాత్రమే పరిమితం అని, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ను కవర్ చేయదని అధికారులు వివరించారు. ఈ ఒప్పందాలు 2024, 2025లో సంతకం చేయబడ్డాయి. తెలుగు రాష్ట్రాలకు […]
Ponguleti Srinivas Reddy : పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల నుంచి నేతలు హాజరయ్యారు. ఒక్కో మండలానికి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల […]
Maoists : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20న బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ ఈ బంద్‌ను ప్రకటించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటనలో ప్రకారం, జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన ఆపరేషన్ కగార్ పేరుతో నేషనల్ పార్క్ పరిధిలో చేపట్టిన దాడుల్లో రాష్ట్ర స్థాయి కీలక నాయకులైన కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, కామ్రేడ్ […]
Weather Updates :తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి గందరగోళంగా మారింది. భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, జూన్ 17వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రోజంతా మేఘాలు కమ్ముకున్నా, వర్షం మాత్రం కొన్ని చోట్లే కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మధ్య, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాయంత్రం తరువాత జల్లులు పడొచ్చని […]
యోగా డే సందర్బంగా విశాఖలో ప్రధాని మోడీ పర్యటన..! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి, అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ జూన్ 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్ […]