అక్కడ రాజకీయ నాయకులు అంతా తెలిసే… కావాలని కెలుకుతున్నారా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌లో అటవీ శాఖ బకరా అవుతోందా? ఆ పార్టీ… ఈ పార్టీ… అని లేదు, ఏ పార్టీ అయినా సరే… అదే తీరా? అధికారుల్ని జనంలో తిట్టేసి తాము హీరోలైపోదామని రాజకీయ నేతలు అనుకుంటున్నారా? పాత వ్యవహారాలకు కొత్త హంగులు అద్దుతున్న ఆ నాయకులు ఎవరు? ఏంటా ఫారెస్ట్ పాలిటిక్స్?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల… పార్టీ ఏదైనా సరే… రాజకీయ నేత ఎవరైనా సరే… […]
Maoists : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు నేతలు పోలీసులకు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న కాగా, మరొకరు బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అంకూభాయ్. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా […]
Muralidhar Rao : నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సోదాలు సుమారు 15 గంటల పాటు కొనసాగాయి. మురళీధర్ రావు నివాసమైన బంజారాహిల్స్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో వెలుగు చూసిన కోట్లాది రూపాయల అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దర్యాప్తులో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన భారీ స్థిరాస్తులు, […]
Twist : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లా అస్మోలి ప్రాంతంలో సోషల్ మీడియా ద్వారా అసభ్యతను ప్రోత్సహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహక్, పరిలు అనే ఇద్దరు యువతులు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, వారి ఇద్దరు సహచరులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యంగా, అశ్లీలతతో కూడిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారని పోలీసులకు స్థానికుల నుంచి వరుస ఫిర్యాదులు అందాయి. వీరిని సంభల్ పోలీసులు అరెస్ట్ చేసి, జైల్లోకి తరలించారు. సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న ‘మహక్ పరిచ 143’ […]
BC Reservation : బీసీలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018లో చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణ చేస్తూ తాజా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. 2018లో అప్పటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 32 శాతం నుంచి తగ్గించి 22 శాతానికి పరిమితం చేస్తూ ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ తగ్గింపు తీరుపై అప్పట్లోనే పలువురు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు […]
Posters : ములుగు జిల్లా కన్నాయిగుడెం మండలంలోని గుత్తికొయ గూడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అనూహ్యంగా వాల్ పోస్టర్లు కనిపించి స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ‘ప్రజా ఫ్రంట్’ పేరిట వెలుసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుపై విమర్శలు గుప్పిస్తూ, వారికి మార్గదర్శనం చేసేలా ఉన్నాయి. ఈ పోస్టర్లలో మావోయిస్టు సిద్ధాంతాన్ని సూటిగా ప్రశ్నిస్తూ – “సిద్ధాంతం కోసం అడవిలోకి వెళ్లిన అన్నల్లారా, అక్కల్లారా… మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఎప్పుడైనా ఆశాకిరణంగా మారిందా?” అని ప్రశ్నించారు. అంతేగాక, నాలుగు […]
Murder: బెలగావి జిల్లా రామదుర్గ తాలూకాలోని ఖాన్పేట్ సమీపంలో జూలై 7న ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడిన స్థితిలో మృతదేహం గుర్తించబడింది. మెడకు టవల్‌తో బిగించి, మర్మాంగంపై దాడి చేసి, తలపై కండరంతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసిన రామదుర్గ పోలీసులు, మృతుడిని ధారవాడ అమ్మినబావి గ్రామానికి చెందిన ఈరప్ప ఆడిన్గా గుర్తించారు. కేసును లోతుగా విచారించగా, హత్య వెనుక హృదయాన్ని కలచివేసే కుటుంబ రహస్యాలు వెలుగులోకి […]
Banakacharla : రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల శక్తి శాఖ ఈనెల 16న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్లను ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది. […]
Bhatti Vikramakra : తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు. మూసీ పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందదని ఆయన అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి, యావత్ కేబినెట్, ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు అని ఆయన అన్నారు. మా ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, పెండింగ్ […]
Prosthetic Foot : దేశంలో తొలిసారిగా తక్కువ ఖర్చుతో ఉన్న అధునాతన కర్బన్ ఫైబర్ కృత్రిమ కాలుపాదాన్ని భారతీయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL) మరియు ఎయిమ్స్ బీబీనగర్ సంయుక్తంగా ఈ పాదాన్ని రూపొందించారు. ఈ వినూత్న ఆవిష్కరణను మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ కాలుపాదం, దిగువస్థాయి ఆదాయ గల అమ్ప్యూటీలకు గుణాత్మక ప్రోస్తెటిక్ లభ్యతను పెంచడంతో […]