Hyderabad Crime : హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు
- హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు
- అర్ధరాత్రి రోడ్లపై నానా న్యూసెన్స్
- ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు
- బైక్ రేసింగ్.. బర్త్ డే పార్టీలు.. అంటూ రోడ్లపై హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime : హైదరాబాద్‌లో పోకిరీల హాంగామాకు హద్దూ అదుపూ లేకుండా పోయింది. అర్థరాత్రి రోడ్ల మీద నానా హంగామా చేస్తూ జనజీవనానికి ఆటంకం కలిగిస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో జోగుతూ.. నడి రోడ్డుపై కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. ఇలా నానా న్యూసెన్స్ చేస్తున్న పోకిరీల ఆట కట్టించాలని సిటీ జనం కోరుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో జరిగింది. ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్న ముజఫర్ అనే యువకుడు తన బర్త్ డే పార్టీ కోసం మిత్రులను ఆహ్వానించాడు. అర్ధరాత్రి రోడ్డుపై డీజే పెట్టి హంగామా చేశాడు. అంతే కాదు కత్తులు, తల్వార్లతో డాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. వీళ్ల డాన్స్ వీడియోలను ఎవరో స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోలపై దృష్టిసారించిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు..
Hyderabad: నగరం నడిబొడ్డులో పట్ట పగలే హత్య.. కత్తులతో దారుణంగా నరికి…
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
మరోవైపు ఈ బర్త్ డే పార్టీ వల్ల తాము ఇబ్బంది పడ్డామని కొంత మంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముజఫర్ బర్త్ డే పార్టీగా గుర్తించారు. అంతే కాదు బర్త్ డే పార్టీలో పాల్గొని హంగామా చేసిన యువకుల వివరాలు సేకరించారు. అందరిపైనా పబ్లిక్ న్యూసెన్స్, సౌండ్ పొల్యూషన్, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారు ఎవరినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరి వల్లనైనా ఇబ్బంది కలిగితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. పబ్లిక్ న్యూసెన్స్ చేసినా.. అర్థరాత్రి రోడ్లపై హంగామా చేసినా తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
Hyderabad: పూటకోవేశం.. జనాలను చీట్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!