Medical Students Ganja Case: మెడిసిటీ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం..
- వందమందికిపైగా మెడికోల్లో గంజాయి వినియోగం
- ఈగల్ టీం షాకింగ్ నివేదిక
- సీనియర్లే జూనియర్లకు డ్రగ్స్ అలవాటు చేసి కాలేజీ సర్కిల్‌లో నెట్‌వర్క్
- డ్రగ్ పెడ్లర్ అరాఫత్.. బీదర్‌కు చెందిన మహిళా సరఫరాదారు జరీనా కస్టడీ లోకి
- ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులే టార్గెట్.. రూ.1.5 కోట్ల మాదక ద్రవ్య దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medical Students Ganja Case: నగరంలోని ప్రసిద్ధ మెడిసిటీ మెడికల్ కాలేజీ గంజాయి కేసు చుట్టూ సంచలన విషయాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. మూడు సంవత్సరాలుగా మెడికోల్లో గంజాయి వినియోగం నానాటికీ పెరిగిపోతుండగా, తాజాగా ఈగల్ టీం జరిపిన దర్యాప్తులో ఈ వ్యవహారం మరింత లోతుగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈగల్ టీం అందించిన సమాచారం ప్రకారం, ఈ కాలేజీలో దాదాపు వందమందికిపైగా మెడికోలు గంజాయి వాడుతున్నట్లు గుర్తించబడింది. అందులో 32 మంది మెడికోలు గత ఏడాది నుంచి రెగ్యులర్‌గా గంజాయి తీసుకుంటున్నట్టు ఆధారాలు లభించాయి.
Visakhapatnam Port Authority: విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. భారత్‌లోనే ప్రథమ స్థానం..
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్‌వర్క్ తీవ్ర కలకలం..
మరికొన్ని షాకింగ్ వివరాల్లో, సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేసి, వారినే వాడుకుని డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు తేలింది. గంజాయి కోసం ఈ విద్యార్థులు తరచుగా క్యాంపస్ వదిలి సికింద్రాబాద్ వెళ్లి డ్రగ్స్ తెచ్చుకున్నట్లు ఈగల్ టీం తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యక్తి మెడిసిటీ సహా పలు కాలేజీలకు గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలుస్తోంది. అరాఫత్, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన జరీనా అనే మహిళ నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడని ఈగల్ టీం గుర్తించింది.
జరీనాను కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి ఆశ్చర్యకర విషయాలను వెలికితీశారు. ఆమె గత సంవత్సరం నుంచి సుమారు ₹1.5 కోట్ల విలువైన గంజాయి అమ్మి సంపాదించిందని, హైదరాబాద్ నగరంలో 51 మంది సభ్యులతో కూడిన పెద్ద డ్రగ్ నెట్‌వర్క్ను నడుపుతోందని సమాచారం. జరీనా తన ముఠాలోని డ్రగ్ పెడ్లర్లను ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీల విద్యార్థులను టార్గెట్ చేసి, వారిలో డ్రగ్స్ అలవాటు చేయడానికి ఉపయోగించిందని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ నెట్‌వర్క్ మొత్తం మీద దృష్టి సారించగా, ఇంకా కొందరు విద్యార్థులు, పెడ్లర్లను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Jagga Reddy : లక్ష కోట్లలో 30% తినేసి.. హరీష్ రావు ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!