Yogaday Countdown : జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం రంగురంగుల తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా జూన్ 20న 24 గంటల ముందు కౌంట్‌డౌన్ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన ఘనత భారత్‌దే అని పలువురు ప్రముఖులు ఈ వేడుకల సందర్భంగా తెలియజేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అందరూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ […]
నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్. ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనున్న భారత్. లీడ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్. విశాఖ: నేడు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్రమోడీ. సాయంత్రం 6.45 నిముషాలకు ఐఎన్ఎస్ డేగా వైమానిక స్థావరానికి చేరుకోనున్న ప్రధాని. స్వాగతం పలుకనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు. పెహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్ర మౌళి భార్యకు ప్రధానిని కలిసే అవకాశం.. స్వాగత కార్యక్రమాల తర్వాత తూర్పు నావికాదళ […]
NTV Daily Astrology as on June 20th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
Suicide : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాధితురాలిని సుష్మ (27)గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుఝామున 4 గంటలకు బొట్టు అంజయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్‌ను మాదాపూర్ పోలీసులకు ఇచ్చారు. “ఆఫీస్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సుష్మ తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. […]
Shocking Incident : హైదరాబాద్ పాతబస్తీలోని ఐ.ఎస్. సదన్ ప్రాంతంలో గురువారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసన చూసి స్థానికులు అనుమానం పోలీసులకు సమాచారం అందించారు. మలక్‌పేటలో ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, సంబంధిత ఇంటిని పరిశీలించారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో అధికారులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇంటి అంతా రక్తపుదారలు కనిపించడంతో […]
ఇజ్రాయెల్ అంతిమ యుద్ధం చేస్తామంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ను తుడిచిపెడతామంటోంది. ఏకంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళానికి, ఇరాన్ క్షిపణుల సామర్థ్యానికి మధ్య నేరుగా పోరు జరుగుతోంది. రెండువైపులా జరుగుతున్న నష్టం తీవ్రంగానే ఉందనే అంచనాలున్నాయి. యుద్ధం కొనసాగితే.. ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కు ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు. ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణతో తల్లడిల్లుతున్న ప్రపంచానికి.. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అనుకోని యుద్ధం కొత్త షాక్ ఇచ్చింది. […]
కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, చెట్లు కారణంగా విమాన రాకపోకలకు అడ్డంకిగా మారడంతో వాటి తొలగింపునకు కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు లేదా చెట్లు విమానయానానికి అడ్డంకిగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని ఆదేశించింది. సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసు వచ్చిన 60 రోజుల లోపు భవనాల యజమానులు వాటి ఎత్తు తగ్గించాలి లేదా […]
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో మూడు విడతలుగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారితో పాటు ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావును విచారించిన సిట్, ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడంలేదని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ యోచిస్తోంది. ఇప్పటికే ఆయనపై విచారణలో ఎదురవుతున్న ఇబ్బందుల […]
Oneplus Store : హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్లో ఫోన్ రిపేర్ కోసం వచ్చిన కస్టమర్లకు ఎదురైన అనుభవం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సర్వీస్ సెంటర్ సిబ్బందితో పాటు నారాయణగూడ పోలీసులు కస్టమర్లపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కస్టమర్లు తమ ఫోన్లను రిపేర్ చేయించేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లగా, రెండు నెలలు గడిచినా ఫోన్లను తిరిగి అందజేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సర్వీస్ సెంటర్ మేనేజర్‌ను ప్రశ్నించిన కస్టమర్లతో వాగ్వాదం చోటుచేసుకుంది. […]
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురాలో గురువారం ఉదయం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్టూన్ గోదాంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి శ్రమించారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గోదాంలో […]