Nityapelli Koduku : ఖాకీ చొక్కా వేసుకున్న కామాంధుడు.. నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.. దీంతో సూర్యాపేట పోలీస్ ఉన్నతాధికారులు… ఆ కానిస్టేబుల్ కామాంధుడి తొక్క తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఫోటోలో అమాయకంగా బొట్టు పెట్టుకుని చూస్తున్న వ్యక్తి పేరు కృష్ణం రాజు. సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్నా.. ఇతని బుద్ధి మాత్రం వక్రీకరించింది. 2012 బ్యాచ్‌కు చెందిన కృష్ణంరాజు క్రమశిక్షణారాహిత్యంతో ఇప్పటికే పలుమార్లు సస్పెండ్ అయ్యాడు. ఇక ఇప్పుడు నిత్య పెళ్లి కొడుకులా మారి తాజాగా వార్తల్లోకి ఎక్కాడు..
కృష్ణం రాజుకు నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మహిళతో మొదటి వివాహం జరిగింది. ఐతే పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా వ్యవహారం చెడిపోవడంతో విషయం కోర్టుకెక్కింది. ఆమెతోనూ విడాకుల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో నడుస్తోంది. కానీ ఆ కేసును నడుస్తుండగానే ముచ్చటగా మూడో వివాహం కూడా చేసుకున్నాడు. ఇక కృష్ణం రాజు.. అంతటితో ఆగలేదు. సూర్యాపేటకు చెందిన ఓ మైనర్ బాలికను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇది చట్ట విరుద్ధం అని తెలిసినా.. పదో తరగతి అమ్మాయిని మనువాడాడు. అంతే కాదు ఆ బాలికను శారీరకంగా హింసిస్తున్నాడు. దీంతో మొగుడి వేధింపులు తట్టుకోలేక ఆమె కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెను కూడా దూరం పెట్టేశాడు కృష్ణం రాజు. అలాగని మంచోడు అనుకుంటే మనం పొరబడ్డట్టే. ఎందుకంటే మళ్లీ ఐదో పెళ్లికి సిద్ధపడుతున్నాడు..
Shocking : కోడి కోసం కొట్లాట, ఒకరు మృతి.. వికారాబాద్ జిల్లాలో దారుణం..
తనకు తెలిసిన వారందరినీ సంబంధం చూడమని చెబుతున్నాడు కృష్ణం రాజు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నావ్ కదా అని అడిగితే…. ప్రామిస్….. ఇక ఇదే లాస్ట్ పెళ్లి అంటూ చెవిలో పూలు పెడుతున్నాడు. ఇక నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం ఆ నోటా ఈ నోటా పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో కృష్ణంరాజుపై చర్యలకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది… ప్రస్తుతం కృష్ణం రాజు పరారీలో ఉన్నాడు. ఇటు మూడుముళ్ల ముచ్చటపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే తన అరాచకాలు బయటకు చెప్పితే చంపేస్తానంటూ కానిస్టేబుల్ కృష్ణంరాజు మైనర్ కుటుంబాన్ని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది…
అమాయక మహిళల బలహీనతలను, ఆ కుటుంబాల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకున్న కానిస్టేబుల్ కృష్ణం రాజు.. పెళ్లిళ్ల పేరుతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అంతే కాదు.. తన తండ్రికి మంత్రాలు వస్తాయని.. చేతబడి చేయించి చంపేస్తానని భాదిత కుటుంబాలపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు… ఇక కానిస్టేబుల్ కృష్ణంరాజు నిత్యపెళ్లికొడు మాత్రమే కాదు… లంచగొండి కూడా అని చెబుతున్నారు. గతంలో తిరుమలగిరి మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇసుక దందాలో డబ్బులు వసూలు చేస్తున్నాడని…. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.
అటు విధి నిర్వహాణలో ఉండగానే రీల్స్ చేయడం కూడా కానిస్టేబుల్ కృష్ణంరాజు రొటీన్ వర్క్. పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో కూర్చోని రీల్స్ చేయడం.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేయడం… వచ్చిన కామెంట్స్, లైక్స్‌తో మహిళలను ట్రాప్ చేయడం కూడా కానిస్టేబుల్ కృష్ణంరాజు ప్రత్యేకతగా తెలుస్తోంది… సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు, కామెంట్స్ పెట్టడం ఇతడి వ్యవహార శైలిపై అనేక రకాలైన ఆరోపణలు రావడంతో గతంలో లా అండ్ ఆర్డర్ విధులను తప్పించి లూప్ లైన్‌కు పంపిచారు ఉన్నతాధికారులు. అయినా పద్దతి మార్చుకోని కానిస్టేబుల్ కృష్ణంరాజు వివాదాలకు, నిత్య పెళ్లికొడుకు అవతారంపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు…
Deputy CM Pawan Kalyan: పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక.. 1,500 మంది మహిళలకు చీరలు పంపిన పవన్..