Gogikar Sai Krishna
Author- NTV Telugu-
ఏపీలో కొత్త కరోనా కేసులెన్నంటే..?
ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన కరోనా… ఏపీలో తగ్గుముఖం పడుతోంది. తాజాగా 33,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 262 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. అయితే గడిచిన 24 గంటల్లో కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించినట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో పాటు 229 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 20,69,614 మందికి కరోనా వైరస్ బారిన పడగా, 20,51,976 మంది కరోనా నుంచి కోలుకున్నారు. […] -
ఈ సారి బిగ్ బాస్ 5 విన్నర్ షణ్ణునే..?
ఎన్ని విమర్శలు, ఆరోపణల మధ్య బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. ఈ సీజన్ కూడా హోస్ట్‌గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ మొదట్ల కాస్త అటుఇటుగా అనుపించినా రానురాను రసవత్తరంగా మారింది. వారం వారం ఎలిమినేషన్లతో బిగ్ బాస్ హౌస్ వేడెక్కింది. టాస్క్‌లు డ్రామాల మధ్య సాగుతున్న బిగ్ బాస్ 5.. మరోసారి ప్రేక్షకులను అలరిస్తోందనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ ప్రేమికులందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. ఈ సారి బిగ్ బాస్ సీజన్ […] -
జై కిసాన్ నినాదాన్ని.. నై కిసాన్ గా మార్చారు : హరీష్‌రావు
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో టీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ధర్నాలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమిస్తే.. ఇప్పుడు రైతుల కోసం ఉద్యమించాల్సి వస్తోందన్నారు. జై కిసాన్ నినాదాన్ని.. నై కిసాన్ గా కేంద్ర ప్రభుత్వం మార్చిందన్నారు. రా రైస్ అంటూ బీజేపీ నేతలు తేలివిగా మాట్లాడుతున్నారని.. […] -
టీఆర్ఎస్, బీజేపీలను ఏకిపారేసిన భట్టి విక్రమార్క..
తెలంగాణ ధాన్యం కొనుగోలు రచ్చ జరుగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అధికారంలో ఉన్న టీఆర్స్ నేతలే రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ నేతలేమో రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు చేతకాక కల్లబొల్లి కబుర్లు చెబుతోందని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనాల్సిన వాళ్ళే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని, మీకు చేత కాక చేతులు ఎతేశరా..? మాకు రాష్ట్ర పాలన చేత […] -
టీఆర్ఎస్ అంటే ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ కాదు : కేటీఆర్
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు టీర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్న నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలును కేంద్రం అపొద్దన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం శీతకన్న ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. తెలంగాణ రైతు సమితి అంటూ.. టీఆర్ఎస్ […] -
బ్రేకింగ్ : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కర్కర్దుమా మెట్రో స్టేషన్ సమీపంలో గల రిషబ్ టవర్లోని 6వ అంతస్థులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు 14 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే కాలుష్యపు పొగమంచుతో నిండిన ఢిల్లీలో ఈ ఘటనతో మరింత పొగ అలుముకుంది. -
నిన్నటి నుంచి కనిపించని భార్గవి.. అసలేం జరిగింది..?
హైదరాబాద్‌లో ఓ యువతి అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. దోమలగూడ లో నివాసముంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది. నిన్న బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన భార్గవి తిరిగి రాలేదు. దీంతో నిన్నటి నుంచి కుటుంబీకులు భార్గవి కోసం తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల ఇండ్లలో వెతికినా ఫలితం లేకుండాపోయింది. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న భార్గవికి సంవత్సరం క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో […] -
ఈటల, టీఆర్ఎస్ ఎంపీ భేటీ.. అంతర్యమేంటి..?
గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ క్రీయాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలిశారు. ఉప ఎన్నికల తరువాత తన ఎన్నిక కోసం కృషి చేసినవారిని కలుస్తున్న ఈటల.. అనుహ్యంగా ఎంపీ శ్రీనివాస్‌తో భేటీ అవడంతో.. రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగానే జరిందని బీజేపీ వర్గాలు చెబుతున్నా.. అంతర్యమేంటోనని టీఆర్ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గత కొంత కాలంగా టీఆర్ఎస్కు […] -
బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తున్నారు : చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ దుర్మార్గంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ఏకగ్రీవాలు పెరిగాయని, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపణలు చేశారు. అభ్యర్థులు కోర్టుకు వెళితే.. మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. రైతులు పాదయాత్ర చేస్తుంటే అక్కడ కూడా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. -
కేసీఆర్ పిటిషన్ వెనక్కి తీసుకొని నెల రోజులే : గజేంద్ర సింగ్ షెకావత్
సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కేంద్ర శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. కృష్ణ జలాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ఈ అంశంపై కేసీఆర్ సర్కార్ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నందున మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పామన్నారు. దీంతో రెండు రోజుల్లో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని తెలిపి.. 8 నెలలకు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. పిటిషన్ […]
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!