ఎన్ని విమర్శలు, ఆరోపణల మధ్య బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. ఈ సీజన్ కూడా హోస్ట్‌గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ మొదట్ల కాస్త అటుఇటుగా అనుపించినా రానురాను రసవత్తరంగా మారింది. వారం వారం ఎలిమినేషన్లతో బిగ్ బాస్ హౌస్ వేడెక్కింది. టాస్క్‌లు డ్రామాల మధ్య సాగుతున్న బిగ్ బాస్ 5.. మరోసారి ప్రేక్షకులను అలరిస్తోందనే చెప్పాలి.
అయితే బిగ్ బాస్ ప్రేమికులందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. ఈ సారి బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరవుతారు..? అని. అయితే ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5 విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా షణ్ముక్ జస్వంత్‌కు కనిపిస్తున్నాయని ఓ వాదన. అయితే య్యుట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌తో ఫేమస్ అయిన షణ్ముక్.. కరోనా లాక్‌డౌన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే లఘు చిత్రంతో మరింత అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సూర్య షార్ట్ ఫిల్మ్‌తో కూడా అభిమానులను ఆకట్టుకున్నాడు.
దీంతో షణ్ణుకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే.. యుట్యూబ్‌లో తన షార్ట్ ఫిల్మ్ పెట్టిన కొద్ది గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకునే సత్తా.. ఫాలోయింగ్ ఉన్న షణ్ణు ఈ సారి బిగ్‌బాస్ సీజన్ విన్నర్ అయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు షణ్ణు అభిమానులు.