Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్కడుంటే అక్కడ సందడే. తాజాగా ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ బ్యూటీ, తనదైన చలాకీతనంతో వేదికపై ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా యువ హీరో ఆనంద్ దేవరకొండపై ఆమె చూపించిన ప్రేమ, అతన్ని ముద్దుగా “ఆనందా” అని పిలిచిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆనంద్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని రష్మిక వేదికపై పంచుకుంటూ మురిసిపోయింది. “నిన్నే ఆనంద్ నాకు మెసేజ్ చేసి ఈవెంట్ కి రమ్మన్నాడు. నేను హైదరాబాద్‌లోనే ‘రెయిన్ బో’ షూటింగ్లో ఉన్నాను కాబట్టి వెంటనే వచ్చేసాను. ఐ జస్ట్ లవ్ థిస్ బాయ్.. అతను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తను చేసే ప్రతి సినిమా, బిజినెస్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను” అంటూ ఆనంద్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆనంద్ చాలా స్మార్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అని, ఇంటర్వ్యూలలో అతను అంత స్పష్టంగా, చక్కగా మాట్లాడుతుంటే తనకు కుళ్లుగా (ఎన్వియస్) అనిపిస్తుందని సరదాగా వ్యాఖ్యానించింది. ఈవెంట్ చివర్లో యాంకర్ సైతం “రష్మిక గారు ఆనంద్‌ని ఎంత ముద్దుగా ఆనందా అని పిలుస్తున్నారో” అని కామెంట్ చేయడం విశేషం.
‘ఎపిక్’ ట్రైలర్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా కథ గురించి తనకు ఎలాంటి ఐడియా లేదని, మీతో పాటే వేదికపైనే తొలిసారి ట్రైలర్ చూశానని తెలిపింది. చూడగానే తనకు ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ కొరియన్ డ్రామా (కే-డ్రామా) చూస్తున్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఫీల్ గుడ్ రామ్-కామ్ మూవీలు రావడం, వర్కౌట్ అవ్వడం చాలా కష్టమని, ఈ సినిమా ఆ మ్యాజిక్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. హీరోయిన్ వర్షు క్యారెక్టర్‌ను అత్యద్భుతంగా డిజైన్ చేశారని ఆనంద్ తనకు ముందే చెప్పాడని, తెరపై ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉందంటూ రష్మిక ప్రశంసించింది. మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి మంచి క్యారెక్టర్స్ రాస్తున్నందుకు సంతోషంగా ఉందంది. అలాగే ఎప్పుడూ ఎంతో షైగా కనిపించే ఆదిత్య ఈ ట్రైలర్ లో మాత్రం కల్చరల్ షాక్ ఇచ్చేలా వైల్డ్ గా కనిపించాడని మెచ్చుకుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కోసం తనతో కలిసి పనిచేస్తున్న సంగీత దర్శకుడు హేశాంత్ తో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్న రష్మిక.. సీనియర్ నటుడు శివాజీని ఈ వేదికపై కలవడం ఆనందంగా ఉందని తెలిపింది. చివరగా ‘రెయిన్ బో’ సినిమా అప్డేట్ అడుగుతున్న ఫ్యాన్స్ కు.. షూటింగ్ జరుగుతోందని సరదాగా సమాధానమిస్తూనే, తన ఫోకస్ మొత్తం ఇప్పుడు ‘ఎపిక్’ పైనే ఉందంటూ హుందాగా వ్యవహరించింది. సెప్టెంబర్ 10న ప్రీమియర్స్, 11న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘ఎపిక్’ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కొరియన్ హార్ట్ సింబల్ తో ఈవెంట్ ను ముగించింది.
Also Read
తాజావార్తలు
-
DMK Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. కేంద్రం హామీతో స్టాలిన్ తీర్మానం..
-
OTR: వైసీపీకి దూరంగా తమ్మినేని సీతారాం?.. కీలక సమయంలో ఎందుకు సైలెంట్?
-
Hyderabad: ఓయోలో గుంటూరు యువకుడు అనుమానాస్పద మృతి..
-
Gold Sale Income Tax: తల్లిదండ్రుల బంగారం అమ్మి ఇల్లు కొన్న వ్యక్తికి రూ.60 లక్షల ట్యాక్స్ షాక్.. అసలు ఏం జరిగిందంటే?
-
Bengali Aloo Posto Recipe: ఆలూ కూర తిని విసుగొచ్చిందా? బెంగాలీ స్టైల్లో ఆలూ పోస్తో ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
ట్రెండింగ్
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!