Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- కేబినెట్లో మూడుకు పెరిగిన ఖాళీల సంఖ్య..
- అసెంబ్లీ ముగిసిన తర్వాత కేబినెట్ గురించి ఆలోచిస్తారా..?..
- కేబినెట్ విస్తరణకు అధిష్టానం నుంచి అనుమతి..?..
- బీసీ సామాజికవర్గం నుంచి ముందువరుసలో ఆది శ్రీనివాస్..
- రెడ్డి కోటాలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు..
- పరిశీలనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా..
- లంబాడాలకు ఇచ్చేట్టు అయితే రేసులో బాలునాయక్..?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండొచ్చన్న ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇన్నాళ్లు కేబినెట్లో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు సురేఖను తప్పించడంతో ఖాళీల సంఖ్య మూడుకు పెరిగింది. మరి ఈ మూడు మంత్రి పదవులను ఎప్పుడూ భర్తీ చేస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. కేబినేట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా..? ఆ అవకాశమే ఉండదా..? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా తెలంగాణలో కూడా నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత.. కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించే అవకాశముందట. ఇప్పటికే ఈ విషయంలో అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ముహూర్తం ఫిక్స్ చేసుకోవాల్సింది సీఎం రేవంతే. కేబినెట్ విస్తరణలో బీసీ సామాజికవర్గానికి అవకాశం దక్కడం పక్కానే. ఎందుకంటే బీసీ మంత్రి అయిన కొండా సురేఖను పదవి నుంచి తప్పించినందున… బీసీ సామాజికవర్గం నుంచి ఒకరిని కేబినెట్లోకి తీసుకోవడం ఖాయమే. మరి ఛాన్స్ దక్కేదెవరికి..?
ఆశావహులు అనేకమంది ఉన్నారు. బీసీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారట. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేరు కూడా పరిశీలనలో ఉందట. కేబినెట్ నుంచి తప్పించింది మహిళను కదా… ఆ ప్లేస్‌లో మహిళనే తీసుకోవాలి కదా..? అనే చర్చకు స్పేస్ ఇవ్వకుండా ముగ్గురు మహిళా నేతలకు పదవులు ఇచ్చేశారు. ఇక మిగిలిన రెండు మంత్రి పదవులను ఎలా భర్తీ చేయాలి..? రెడ్డి సామాజిక వర్గానికి ఒక పదవి ఇవ్వడం పక్కా. ఆ కోటాలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. పైగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్క మంత్రి కూడా లేరు. దీంతో ఆ జిల్లాకు అవకాశం ఇవ్వాలనే ఈక్వేషన్ ఉందట. మరో వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలారోజులుగా పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఆయన్ని కేబినేట్లోకి తీసుకున్నాక కూడా పంథా మార్చకపోతే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోందట. రాజగోపాల్ రెడ్డి తన పంథాలోనే కంటిన్యూ అయితే పార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే మాటలు వినిపిస్తున్ననాయి. పైగా కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరికి ఛాన్స్ ఇవ్వడంపై అధిష్టానం కూడా భిన్నరకాలుగా చర్చిస్తుంది.
Also Read
మరో మంత్రి పదవి STల నుంచి లంబాడా సామాజికవర్గానికి ఇవ్వాలనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోందట. లంబాడా వర్గానికి ఇచ్చేట్టు అయితే… దేవరకొండ MLA బాలు నాయక్ రేసులో ఉంటారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి, బాలు నాయక్‌కు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే… ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు అవుతారు. దీనిని కూడా పార్టీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు రెడ్డి మంత్రులున్నారు. మళ్ళీ మూడో రెడ్డికి అవకాశం ఇస్తారా..? మరోవైపు బాలు నాయక్‌ను… డిప్యూటీ స్పీకర్ చేయాలనే చర్చ కూడా వచ్చిందట. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించారు కాబట్టి ఆ జిల్లాకు చెందిన లంబాడాకు అవకాశం ఇస్తారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. అలాగైతే రామచంద్రు నాయక్ పేరును పరిశీలించాల్సి ఉంటుంది. ఆయనపై అధిష్ఠానం ఇప్పటికే సీరియస్‌గా ఉంది. డిప్యూటీ స్పీకర్‌గా అభ్యర్థిత్వం ప్రకటించినా… పదవి తీసుకోకపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీరియస్‌గా ఉన్నారట. మరి లంబాడా కోటాలో బాలు నాయక్ మంత్రి అవుతారా..? లేదంటే రామచంద్ర నాయక్‌కు అవకాశం దక్కుతుందా..? అనే చర్చ కాంగ్రెస్‌లో గట్టిగానే నడుస్తోందట. మరి సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముంది..? ఆయన ఎవరిని ఎంపిక చేసుకుంటారు..? అనేది త్వరలో క్లారిటీ రావొచ్చంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!