Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Enfield Himalayan 440 Launched: అడ్వెంచర్ బైక్ ప్రియులకు రాయల్ ఎన్ఫీల్డ్ గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ కొత్త హిమాలయన్ 440 బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం విక్రయిస్తున్న హిమాలయన్‌తో పాటు ఈ కొత్త మోడల్ కూడా అందుబాటులో ఉంటుంది. హిమాలయన్ 411 డిజైన్‌ను ఇష్టపడినవారిని, హిమాలయన్ 450కి తక్కువ ధరలో ప్రత్యామ్నాయం కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బైక్‌ను తీసుకొచ్చింది. కొత్త హిమాలయన్ 440లో రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440లో ఉపయోగించిన అదే ఇంజన్‌ను అమర్చింది. డిజైన్ పరంగా కూడా స్క్రామ్ 440 ప్రభావం కనిపిస్తుంది. అయితే రంగులు, వీల్స్, సస్పెన్షన్ సెటప్ వంటి అంశాల్లో ఇది స్క్రామ్ 440కి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా హిమాలయన్ 411ను మిస్ అవుతున్న అభిమానులను ఆకట్టుకునేలా దీని డిజైన్‌ను రూపొందించారు.
ఇంజన్, పనితీరు
హిమాలయన్ 440లో 24.4 హెచ్‌పీ పవర్, 34 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంజన్ ఉంది. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. అడ్వెంచర్ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని బైక్‌కు తగిన సస్పెన్షన్ సెటప్‌ను అందించారు.
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
బ్రేకులు, ఏబీఎస్
ఈ బైక్‌లో 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ముందు వైపు 300 మిమీ, వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేకులు అందించారు. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ను స్టాండర్డ్‌గా ఇచ్చారు. అవసరాన్ని బట్టి వెనుక ఏబీఎస్ను నిలిపివేసే ఆప్షన్ కూడా ఉంది.
నావిగేషన్‌తో కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
హిమాలయన్ 440లో ట్విన్-పాడ్ లేఅవుట్‌తో కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఎడమ వైపున స్పీడోమీటర్ ఉండగా, కుడి వైపున ట్రిప్పర్‌ను ఏర్పాటు చేశారు. గూగుల్ మ్యాప్స్ ఆధారిత నావిగేషన్‌ను ట్రిప్పర్ ద్వారా పొందవచ్చు. దీంతో లాంగ్ రైడ్స్ చేసే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. బైక్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్ కూడా ఉంది.
మూడు రంగుల్లో లభ్యం
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 440 ఒకే వేరియంట్లో మూడు రంగుల ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. మస్టాంగ్ బ్రౌన్, నెల్లా వైట్, సెల్లా బ్లాక్ రంగుల్లో దీనిని కొనుగోలు చేయవచ్చు.
ధర, బుకింగ్స్
హిమాలయన్ 440 ఎక్స్‌షోరూమ్ ధర చెన్నైలో రూ.2.29 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు రాయల్ ఎన్ఫీల్డ్ అధికారిక వెబ్సైట్ లేదా సమీపంలోని కంపెనీ షోరూమ్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?