MGM : ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో సంచలన మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన గోక కుమారస్వామి అనే వ్యక్తి, అసలు మృతుడే కాదని వరంగల్ పోలీసులు తాజాగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. చికిత్సలో ఉన్నపుడే, ఆయన మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు ఒక మృతదేహాన్ని తమ భర్తదని […]
WOW : ఈరోజుల్లో టెక్నాలజీ మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగమైపోయింది. కుటుంబం, స్నేహితులు కంటే ఎక్కువగా మనం మొబైల్, చాట్బాట్లతో కనెక్ట్ అవుతుంటాం. అలాంటి టెక్నాలజీలో ఒకటి .. చాట్‌జీపీటీ (ChatGPT). ఏ చిన్న సందేహం వచ్చినా, ఏదైనా సలహా కావాలన్నా, మొదట గుర్తుకు వచ్చేది ఇదే. అయితే ఇటీవల, ఈ చాట్‌బాట్ ఓ అసాధారణమైన పని చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ పోస్ట్ ప్రకారం, గత 10 ఏళ్లుగా అనేక ఆరోగ్య […]
MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డెడ్ బాడీ మారిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరికి బదులుగా మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి (50) మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. ఆసుపత్రి అధికారులు పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని […]
Baby For Sale : నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్‌లో ఓ ఆడ శిశువు విక్రయించే ఘటన కలకలం రేపుతోంది. ఐదో సంతానంగా ఆడబిడ్డ పుట్టిందని, తాము పోషించలేమని తల్లిదండ్రులే అమ్మేశారు. రెండు లక్షల రూపాయలకు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలుస్తోంది. ముత్యాలమ్మ, వెంకట్రావు అనే దంపతులు ఇప్పటికే నలుగురు పిల్లల తల్లిదండ్రులు. ఐదవ సంతానంగా పుట్టిన ఆడపిల్లను స్థానికుల అనుమానంతో చైల్డ్‌లైన్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై కేసు నమోదు […]
ఒకే అంశంపై బీఆర్ఎస్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయా? పార్టీ వైఖరి కూడా ఎప్పటికప్పుడు మారుతోందా? బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ విషయంలో గులాబీ పార్టీ గందరగోళంలో ఉందా? ఏంటా భిన్న స్వరాలు? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎమ్మెల్సీ కవిత మరోసారి పార్టీని గట్టిగా ఇరుకున పెట్టారా? లెట్స్ వాచ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు బీసీ అజెండాతో ముందుకు వెళ్లాయి. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని […]
CM Revanth Reddy : హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమెరికా స్వాతంత్ర్యం ప్రపంచ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని ప్రశంసించారు. అమెరికా ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలవడమే కాకుండా, ఆవిష్కరణలకు నాంది పలికిన దేశంగా ఎదిగిందని రేవంత్ పేర్కొన్నారు. ఓటమిని అంగీకరించని ఆత్మవిశ్వాసం అమెరికా స్ఫూర్తికి చిహ్నమని, అదే తరహాలో […]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడికి ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివలా? ఇన్నేళ్ళలో ఎన్నడూ లేని కొత్త టాస్క్ ఆయన ముందుకు వచ్చిందా? ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే… చివరికి సొంత కార్యకర్తలే నిలదీసే పరిస్థితి వస్తుందా? ఇంతకీ ఏంటా కొత్త టార్గెట్? మాథవ్ మీద అంత ప్రెజర్ ఎందుకు బిల్డ్ అవుతోంది? ఏపీ బీజేపీలో ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. కూటమిలో వాటాల ప్రస్తావన సీరియస్ అవడంతో… మేమేంటో కూడా నిరూపించుకోవాలని […]
జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర.. టెస్టుల్లో తొలి బ్యాటర్‌గా..! ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్ సిద్ధం చేస్తోందా? దానికి సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో యాక్టివిటీ మొదలైపోయిందా? షెడ్యూల్ కంటే ముందే… బ్యాటింగ్ మొదలుపెట్టాలని కాంగ్రెస్ పెద్దలు గట్టిగా ఫిక్స్ అయ్యారా? ఇంతకీ అక్కడ అధికార పార్టీ ప్లాన్ ఏంటి? ఎలా అమలు చేయాలనుకుంటోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ…. ఆల్రెడీ యుద్ధానికి అవసరమైన అస్త్ర శస్త్రాలన్నిటినీ సిద్ధం చేసుకుంటోందట. ప్రస్తుతం ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుకాగా… […]
Telangana : మహిళల ఆర్థిక సాధికారతకు తోడుగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) అభివృద్ధికి వడ్డీ లేని రుణాల రూపంలో భారీ నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.344 కోట్లు విడుదల చేయగా, ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించారు. AP Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం! ఈ నిధులను సోసైటీ ఫర్ […]