కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చి మరోసారి అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ తాజాగా భారత్‌లోకి కూడా ప్రవేశించింది. అయితే నవంబర్ 11న ఓ 66ఏళ్ల వ్యక్తి బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు, నవంబర్ 20న 46 ఏళ్ల మరో వ్యక్తి కూడా బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అయితే అందరికీ చేసినట్లుగానే వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్ […]
ఉప్పల్ భగాయత్ మూడో దశ వేలంలోనూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్‌లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01లక్షల చొప్పున ధర పలకడం గమనార్హం. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ […]
రోజూ నాలుగు షోలకు మించకూడదు, బెని ఫిట్ షోస్ అసలు వేయకూడదని ఏపీ సర్కార్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన బాలకృష్ణ ‘అఖండ’ సినిమాను రెండు సినిమా థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. దీంతో అధికారులు ఆ థియేటర్లను సీజ్ చేశారు. చట్ట సవరణ తర్వాత నిబంధనలు ఉల్లంఘించి థియేటర్స్ పై మొదటిసారి సర్కార్ యాక్షన్ తీసుకుంది. కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర మిని ధియేటర్ అఖండ సినిమా ఉదయం […]
సూర్యాపేట డీఎంహెచ్‌వో కుటుంబంలో 6గురికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. సూర్యాపేటలో డీఎంహెచ్‌వో విధులు నిర్వహిస్తున్న కోటాచలం కుమారుడు గత 5 రోజుల క్రితమే జర్మనీ నుంచి వచ్చాడు. అయితే ఇటీవలే కోటాచలం కుటుంబ సభ్యులతో సహా తిరుపతికి వెళ్లివచ్చారు. అయితే తిరుపతి నుంచి వచ్చిన తరువాత కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోటాచలం కుటుంబ సభ్యులు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షల్లో కోటాచం భార్య, కుమారు, కోడలుకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో […]
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడంతో రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో వివిధ రకాల పంటలను పరిశీలించారు. అంతేకాకుండా అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు సాగు చేయాలన్నారు. వరిలాంటి ఒకే రకం పంట వేసి ఇబ్బంది పడొద్దని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఆయన […]
కరోనా మహమ్మారి జర్మనీలో విజృంభిస్తోంది. ఇప్పటికే జర్మనీలో కోవిడ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో రోజుకు 76 వేల పై చిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జర్మనీలో ప్రవేశించింది కూడా. దీంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది. తాజా కేసులతో అక్కడి ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోవడంతో ఏకంగా వైమానిక దళాన్ని కూడా జర్మనీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. అంతేకాకుండా కరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్‌డౌన్‌ను కూడా విధిస్తున్నట్లు […]
ఉత్తరాంధ్ర, ఒడిషాల వైపు జవాద్ తీవ్ర తుఫాన్ ముప్పు ముంచుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు అర్ధరాత్రి వాయుగుండం ఏర్పడనుంది. ఆ తర్వాత 24గంటల్లో తుఫాన్ గాను అనంతరం తీవ్ర తుఫాన్ గాను మారుతుంది. ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులతో ప్రయాణిస్తుంది. దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలు 3రోజుల […]
ప్రపంచ దేశాలతోపాటు అగ్రరాజ్యమైన అమెరికాను సైతం గడగడలాడించింది కరోనా మహమ్మారి. కరోనా ధాటికి ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. కరోనా సోకి ఇంటి పెద్దలు మృతి చెందడంతో చాలా మంది చిన్నారులు అనాథలు మారారు. కరోనా రూపాంతరం చెంది డెల్టా వేరియంట్‌గా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కునేందుకు ఎంతో శ్రమించి శాస్త్రవేత్తలు కోవిడ్ వ్యాక్సిన్లను కనుగొన్నారు. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నమ్మి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. […]
యావత్తు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కరోనా మహమ్మరి రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు పలు దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. నేడు ఇండియాలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) పలు సూచనలు చేసింది. దక్షిణాఫ్రికాలోని యువత తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించింది. కరోనా వేరియంట్లతో పొల్చితే […]
ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్లతో అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాలు.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు ఇప్పటికే వివిధ దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా ఒమిక్రాన్‌పై దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా తాజాగా రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ సోకిన ఇద్దరు కర్ణాటకలోని బెంగూళూరు ఎయిర్‌పోర్టులో నవంబర్ 11న ఒకరు, […]