తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సారాలలో చూడనటువంటి ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే తాజా శనివారం రోజున తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదు కావడం గమనార్హం. ఈ రోజు హైదరాబాద్‌లోని కూడా చలి తీవ్రత పెరిగిందని అధికారులు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం సంగారెడ్డిలో నేడు […]
ఈ నెల 9న ఢిల్లీలోని రోహిణి కోర్టులో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. డీఆర్డీవోకు చెందిన భరత్ భూషణ్ అనే శాస్త్రవేత్తకు తన పక్కింట్లో ఉండే న్యాయవాది అమిత్ విశిష్ట్ కు మధ్య గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు ఒకరిపైఒకరి కేసులు పెట్టుకున్నారు కూడా. అయితే లాయర్‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు […]
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి సేవలో తరించేందుకు మరోసారి టీటీడీ అవకాశం కల్పించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర నిర్ణయిస్తూ టీటీడీ ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం నాడు మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది. ఈ టికెట్‌పై 6గురు స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు. జనవరి రెండో వారం నుంచి 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ టికెట్ల ద్వార రూ.600 […]
మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేస్తూ మరోమారు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీ ప్రత్యేక మార్జిన్లల్లో హేతుబద్దత కోసం ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీలో హేతుబద్దత ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరెటీలపై 5-12 శాతం మేర ధరలు తగ్గే అవకాశం ఉండగా, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకూ ధరలు […]
మరోసారి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద 1.13 కోట్ల విలువ చేసే 1.42 కేజీల బంగారం తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కస్టమ్స్ అధికారు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి బంగారాన్ని కార్టన్ బాక్స్ మధ్య భాగంలో దాచి కేటుగాళ్లు తరలించేందుకు యత్నించారు. అయితే 5 మంది ప్రయాణీకుల కదలికలపై అనుమానంతో కస్టమ్స్ బృందం వారిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తమదైన […]
రుణయాప్‌ల పేరుతో అమయాకులకు ప్రజల అవకాశాన్ని సొమ్ముచేసుకుంటున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ) కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రుణ యాప్ ల కేసులో బ్యాంకింగేతర సంస్థ సీఈఓను ఈడీ అరెస్టు చేసింది. కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ పవిత్ర ప్రదీప్ వాల్వేకర్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 39 ఫిన్ టెక్ కంపెనీలకు కుడోస్ సర్వీస్ ప్రొవైడర్ గా వ్యవహరించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో కుడోస్ సంస్థ […]
వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నిప్పులు చేరిగారు. హిందువులన్నా, హిందూ ఆలయాలన్నా జగన్ ప్రభుత్వానికి చులకనగా కనిపిస్తున్నట్లుందని, హిందువుల సహనాన్ని పరీక్షించాలని చూస్తున్నట్లుందని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి హిందువులు తలచుకుంటే తమ ఓటు ద్వారా మీ ప్రభుత్వానికి భవిష్యత్తు లేకుండా చేస్తారని హెచ్చరించారు. మొన్న త్రిపురాంతకంలో అయ్యప్పస్వామి విగ్రహాన్ని తొలగించారు, నేడు గిద్దలూరులో ఏకంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో […]
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధుపై కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ త్వరలోనే దళిత బంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. దళిత బంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజురాబాద్‌తో పాటు […]
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జగన్నాథ్‌పల్లి గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 గురు మృతి చెందడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య […]
నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ తెలిపారు. వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి […]