ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే బాంబులతో ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. రష్యాకు ఫైటర్ జెట్లు ఉక్రెయిన్ భూతలంలోకి ప్రవేశించిన బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి అగ్రరాజ్యాల దేశాధినేతలు చెప్పినా పుతిన్ ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలో భారత్ లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం […]
ఐక్కా(IKEA) స్వీడిష్ గృహోపకరణాల రిటైలర్, సుసానే పుల్వెరర్‌ను తన భారతదేశ వ్యాపారం కోసం దాని కొత్త మరియు మొదటి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మరియు చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ (CSO)గా నియమించింది. సుసానే అవుట్గోయింగ్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఐక్కా ఇండియాలోని సుసానే పుల్వెరర్ ఇంగ్కా గ్రూప్‌లో ఇంతకుముందు గ్రూప్ బిజినెస్ రిస్క్ మరియు కంప్లయన్స్ మేనేజర్‌గా పనిచేశారు. సుసానే 1997లో ఐక్కాలో చేరారు. ఐక్కాలో సుసానే విభిన్న […]
ఉక్రెయిన్, రష్యా మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారుతున్నాయి. ఉక్రెయిన్‌లో నెలకొన్ని గందరగోళ పరిస్థితుల్లో అక్కడి చిక్కకున్న భారత పౌరులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు సమీపిస్తున్నాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా యోచినలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని భారత్ భావిస్తోందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌లో […]
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తనపై కోవర్ట్ ముద్ర వేసి అవమానాలకు గురిచేస్తున్నారని.. బాధతో రాజీనామా చేస్తున్నట్లు జగ్గారెడ్డి టీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు పుట్టించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఎమ్మెల్యే అయిన జగ్గా రెడ్డి ప్రకటనతో పార్టీలో ఒక్కసారిగా అలజడి రేగింది. గాంధీ కుటుంబంపై అభిమానం ఉన్నప్పటికీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీని వీడనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో నేడు సీఎల్పీ నేతలు […]
ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, 699 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.364 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులను విడుదల చేసింది. ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో జరిగిన పర్యటనలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడంతో పాటు 699 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 […]
ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటు కొత్తవి కలిపి 215 కంపెనీల నుంచి లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.6,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ విజయం సాధించిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనివల్ల అదనంగా 34,000 మందికి ఉపాధి లభించిందని, గత ఏడాదితో పోల్చితే 100 శాతం పెట్టుబడి ఎక్కువైందని ఆయన వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ అయిన బయోఏషియా 19వ ఎడిషన్‌ను ప్రారంభిస్తూ, కోవిడ్ ఆరోగ్య సంరక్షణ రంగంపై దృష్టి […]
ధరణి పోర్టల్‌పై ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎంత మొత్తుకున్నా .. అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారని ఆయన విమర్శించారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులను భయపెట్టి, అక్రమ కేసులు పెట్టి భూమిని ఆక్రమించుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను […]
ఉక్రెయిన్ లోని తెలంగాణ విద్యార్థులందరినీ క్షేమంగా తీసుకురావాలని కేంద్ర మంత్రి కార్యాలయానికి ఇప్పటికే లేఖ రాశామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎప్పటికప్పుడు విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎవరూ టెన్షన్ పడొద్దని తల్లిదండ్రులను కోరారు. ఉక్రెయిన్ లో ఉన్న 20 వేల మంది భారతీయ విద్యార్థినీ, విద్యార్థులను తరలించేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, ఉక్రెయిన్ లో నివసిస్తున్న, […]
ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంటున్న యుద్ధ పరిస్థితులతో అక్కడికి చదువుకునేందుకు వెళ్లిన తెలంగాణ యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకునేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వెళ్లారు. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ళ అజయ్ కుమార్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఐదేళ్ల క్రితం ఎంబీబీఎస్ చదివేందుకు అజయ్ కుమార్ ఉక్రెయిన్ వెళ్లాడు. మరో మూడు నెలలు అయితే అజయ్ కుమార్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చే వాడు. ఇంత లోనే […]
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత నెలకొనలేదు. దీంతో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఈనెల 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో జీవో 35 ప్రకారమే సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ సినిమాలపై కక్ష సాధింపులకు […]