ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రుల తరపున మోడీకి బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగించిందని, ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురిఅయ్యారని ఆయన అన్నారు.సరిగ్గా ఈ సమయంలో మోడీ తన రాజకీయ చతురతతో విద్యార్థులను ప్రత్యేక విమాన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందు నిలచింది. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.36.37 కోట్లు వసూలు చేసి విజయశంఖం పూరించింది. ఒక్క అమెరికాలోనే మొదటి రోజు మిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీలో రూ.7.05 కోట్లు. ఇక ఇతర రాష్ట్రాలు, పరదేశాల్లో కలిపి రూ. 2.90 కోట్లు వసూలు చేసింది. అంటే తెలుగు రాష్ట్రాలలో కాకుండానే మొత్తం రూ.9.95 కోట్లు కొల్లగొట్టింది. […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) అకాల మరణంపై యావత్ సినిమా ఇండస్ట్రీ షాక్‌కి గురైన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణించడాన్ని అతని ఫ్యాన్స్, కన్నడ ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హఠాత్తుగా తమ హీరో మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే గుండె పోటు రావడంతో పునీత్ రాజ్ కుమార్ మరణించారు. ఆయన మరణం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను, ప్రజలను కంట నీరు పెట్టించింది. ఆయన రూపాన్ని.. ఆయన సినిమాల్లో చూసుకుంటున్నారు అభిమానులు. […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఆది నుంచే సమస్యలకు నెలవైంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎంతో మంది రైతులు పేర్లు మారిపోవడం.. గుంట స్థలం ఉన్నవారికి ఎకరా స్థలంగా నమోదైతే.. ఇక ఎకరాల భూమి ఉన్న రైతు గుంట స్థలానికి యజమానికిగా చూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పడు అధికారులు ధరణి పోర్టల్‌ను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ […]
మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సాయిబాబానగర్‌లో ఏటీఎం నగదుతో ఉడాయించిన డ్రైవర్ సాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు నగరాలు తిరిగిన అనంతరం నగరంలో జేబీఎస్ బస్టాండ్‌లో డ్రైవర్ సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19వ తేదీన రైటర్స్ సంస్థ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపటానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్ సాగర్ 36 లక్షలతో పరారయ్యాడు. వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి నగదుతో వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. వివిధ బస్సులు మారుతూ […]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సామాన్య ప్యాలెస్ లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు సాయం బాపురావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు పాల్గొన్నారు. జిల్లాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం ధ్వంద్వ విధానం […]
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది సింగర్స్ కొంతకాలంగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’. పలు నగరాలు, పట్టణాలలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఈ షోలో పాల్గొనేందుకు కొంతమంది గాయనీ గాయకులను ఎంపిక చేశారు. మొత్తానికి మోస్ట్ అవైటింగ్ సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ఫస్ట్ ఎపిసోడ్ ను ఈ శుక్రవారం ఆహా స్ట్రీమింగ్ చేసింది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడిల్ 5 విజేత, బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఈ […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ అట్టుడికిపోతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలో రష్యా దళాలు పడిపోయాయి .. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్నారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. మొదటి వీడియోలో తాను ఇక్కడే ఉన్నాను.. పోరాడుతాం.. ఉక్రెయిన్ను కాపాడుకుంటాం.. ఆయుధాలు కావాలని పేర్కొన్న ఆయన.. ఇక, రెండో వీడియోలో ఏకంగా కీవ్ […]
దక్షిణాది నటుల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో విస్తృతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఆయన పిల్లలు సైతం తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నారు. విజయ్ కుమారుడు సూర్య విజయ్ సేతుపతి నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’లో చిన్నప్పటి సేతుపతిగా నటించాడు. ఆ తర్వాత తండ్రితో ‘సిందుబాద్’లో పైట్ కూడా చేశాడు. ఇక ఆయన కుమార్తె శ్రీజ సేతుపతి తండ్రితో కలసి వెబ్ మూవీ ‘ముగిజ్’లో […]
‘ఏం మాయ చేశావె’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ సినిమా శనివారంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన 12 ఏళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే… లైట్లు, కెమెరా, యాక్షన్ ఇలా సాటిలేని క్షణాల చుట్టూ తిరిగే 12 సంవత్సరాల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఈ […]