వానాకాలం పంట సీజన్‌కు సంబంధించిన సన్నద్ధత పనుల్లో తాము నిమగ్నమైన ఉన్నందున, కృష్ణా బేసిన్లో రిజర్వాయర్ల నిర్వహణపై చర్చించడానికి ఏర్పాటైన కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరగా, అందుకు బోర్డు అంగీకరించలేదు. వివిధ అంశాలపై చర్చించేందుకు నిర్ణీత గడువులు పెట్టుకున్నందున ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20నే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేడు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ తొలి సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్, రూల్ కర్వ్, మిగులు […]
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో చరిత్ర సృష్టించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన మన ఇందూరు బిడ్డ, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. 52 కిలోల విభాగంలో థాయ్ లాండ్ కు చెందిన జిట్ […]
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అభిమానులకు నేడు పండగ రోజు. సన్నిహితులు ముద్దుగా తారక్ అని పిలుచుకునే ఈ నందమూరి స్టార్ 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. యంగ్ టైగర్‌ను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన ఇంటి దగ్గర హడావుడి చేశారు. ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. […]
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అందుకోసం ప్రత్యామ్నాయ ఎజెండాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తాజాగా జాతీయ స్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ నెల 30 వరకు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీల నేతలను కలిసి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ధాన్యం కొనుగోలుపై కొంత కాలంగా కేంద్రంపై […]
1. ఐపీఎల్ సీజన్ 2022లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. 2. నేటి నుంచి కేసీఆర్ జాతీయ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు కేసీఆర్ టూర్ కొనసాగనుంది. వీర మరణం పొందిన సైకి కుటుంబాలకు, రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించున్నారు. 3. నేడు దావోస్‌కు ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నేడు […]
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం రేపు తీర్పును వెలువరించనుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసిని విషయం తెలిసిందే. అయితే.. ఈ ఏడాది జనవరిలో సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు దిశ ఎన్‌కౌంటర్‌పై నివేదికను అందించింది. హైద్రాబాద్‌కు సమీపంలోని షాద్ నగర్ చటాన్‌పల్లి అండర్ పాస్ వద్ద దిశపై నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటన 2019 నవంబర్ […]
తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. విద్యార్థులు చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగా ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. ఇంటర్ ప్రధాన పరీక్షలు పూర్తి అయ్యాయని.. కానీ.. ఇంకా రెండు చిన్న పరీక్షలు మిగిలి ఉన్నాయిన్నారు. అవి 5 వేల లోపే విద్యార్థులు రాస్తారని ఆయన తెలిపారు. ఈ సారి […]
జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. అవసరమనుకుంటే ప్రత్యేక చట్టాలు కూడా చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే.. కేంద్ర, రాష్ట్ర ట్యాక్స్ అంటూ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఇప్పటికే ఎంతో మంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జీఎస్టీపై పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు […]
ఆంధ్రప్రదేశ్‌లో మరో సంక్షేమ కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయితే.. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ వైఎస్సార్ సంచార పశు […]
దేశంలో రోజుకో విషయం తెరపైకి వస్తోంది. మొన్నటికి మొన్న తాజ్ మహల్ కంటే ముందు అక్కడ శివాలయం ఉండేదని, ఆ శివాలయం స్థానంలో తాజ్ మహల్ నిర్మించారని అంటున్నారు. ఓ వాదన తెరపైకి వచ్చింది. అంతేకాకుండా దీనిపై హై కోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే పవిత్ర పుణ్య క్షేత్రమైన కాశీ క్షేత్రంలోని ఓ జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో హిందు ఆలయాల శిథిలాలు కనిపిస్తున్నాయని.. రోజు వారి పూజలకు అనుమతించాలంటూ అక్కడి మహిళలు కోర్టుకెక్కారు. […]