GHMC Corporators Meeting: నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో రెండున్నర నెలల్లో ముగియనుండటంతో ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం కానుంది! 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు కౌన్సిల్ మీటింగ్‌కి నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కౌన్సిల్ మీటింగ్ కోసం కార్పొరేటర్ల నుంచి అధికారులు ప్రశ్నలను స్వీకరించారు. గడిచిన ఐదేళ్లలో చేసిన పనులపై ఈ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది. హెచ్ సిటీ పనులు, ఎస్ఆర్డీపీ పనులు, స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరగనుంది.
READ MORE: NTRNeel : ఎన్టీఆర్ పొటెన్షియల్ ను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ సరిగా చూపించలేదు : మైత్రీ రవి
ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈ సారి బతుకమ్మకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఇప్పటికే తమ పార్టీ పెద్దలతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. చివరి కౌన్సిల్ మీటింగ్‌లో అయినా ఎలాంటి గొడవలు లేకుండా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కాంగ్రెస్ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు.. నగరంలో ఉన్న సమస్యలపై నిలదీయడానికి సిద్ధమైన బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు సిద్ధమయ్యారు.
READ MORE: NTRNeel : ఎన్టీఆర్ పొటెన్షియల్ ను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ సరిగా చూపించలేదు : మైత్రీ రవి