Pocharam Infocity: ఇన్ఫోసిస్ క్యాంపస్ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocharam Infocity: పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కన అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. టార్చ్‌లైట్లు, పూజా సామాగ్రి, గడ్డపారలతో కొందరు వ్యక్తులు ఏదో చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. చూస్తే ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టే అనిపించింది. ఇదే విషయం స్థానికుల దృష్టికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు.. తవ్విన ఓ పెద్ద గుంతతో పాటు.. పగలగొట్టిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. ఇది ఏదో పూజ తంతులా అనిపించింది. స్పాట్‌లో 8 మంది వ్యక్తులకు పోలీసులకు చిక్కారు. ప్రశ్నిస్తే మొదట్లో ఎవరూ నోరు విప్పలేదు. ఎంత అడిగినా ఏమీ లేదు సార్ అని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
READ MORE: Off The Record : రాజోలు రచ్చకు అసలు కారణం ఏంటి ? పవన్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితులు మారట్లేదా ?
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
చివరకు పోలీసులు తమదై స్టైల్‌లో అడగడంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని.. ఒక కారు, రెండు బైకులు, పూజా వస్తువులు, గుంతలు తవ్వే సామగ్రి, ఎనిమిది మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం వరంగల్, ములుగు జిల్లాల్లో కూడా ఇదే తరహా కథ హడావుడి చేసింది. మంగపేట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ .. మరికొందరితో కలిసి మహారాష్ట్రలో తవ్వకాలు జరిపి రాగి బిందె దొరికిందని చెప్పాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయంటూ గుట్టుగా పంచుకునే ప్లాన్ వేసినప్పటికీ, పంపకాల విషయంలో గొడవ జరిగి విషయం పోలీసులకు దృష్టికి వెళ్లింది. ఈజీగా వచ్చే డబ్బు అన్నది.. కేవలం కథల్లో, కబుర్లలో మాత్రమే ఉంటుంది. నిజ జీవితంలో మాత్రం కష్టాన్ని తప్పించే షార్ట్ కట్‌లు అన్నీ.. చివరకు పోలీస్ స్టేషన్ వద్దకే తీసుకెళ్తాయి.
READ MORE: IBomma Ravi : ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!