Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police: సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలనే మోజులో కొందరు చేస్తున్న అసభ్యకరమైన పనులు సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. వ్యూస్ కోసం విలువలనే విస్మరిస్తారా? అని ప్రశ్నించారు. ఇక మీద మితి మీరితే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. “ముఖ్యంగా చిన్నారులు, యువత మనసులపై ఇవి విషం చిమ్ముతున్నాయి. డబ్బు, స్పాన్సర్‌షిప్‌ల కోసం ‘Thirst Trap’ వంటి పద్ధతులతో సంస్కృతిని కలుషితం చేయడం దుర్మార్గం. గుర్తుంచుకోండి.. ‘రీల్’ ప్రపంచంలో వచ్చే చప్పట్ల కోసం ‘రియల్’ లైఫ్ గౌరవాన్ని కోల్పోకండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, షేర్ ఒక మద్దతు లాంటిది. ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం అంటే అసాంఘికతను పెంచి పోషించడమే. అసభ్యకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని మర్చిపోవద్దు. బాధ్యత గల పౌరులుగా సోషల్ మీడియాను ఒక విజ్ఞాన వేదికగా మార్చండి.” అని హెచ్చరించారు.
READ MORE: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా రోజు రోజుకూ దారుణంగా మారుతోంది. కొందరు మంచి పనుల కోసం వాడుకుంటే ఎక్కువ శాతం పిచ్చి పనులు, విచిత్ర, అసభ్య కంటెంట్ కోసం వాడుతున్నారు. మరికొందరు మాత్రం రెచ్చిపోయి అసభ్యకర కంటెంట్ చేస్తున్నారు. ఇదంతా లైక్స్, ఫాలోవర్స్ కోసమే. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడం మానుకోవాలి. అంతేకాదు.. రీల్స్ (Reels) కోసం ప్రాణాలను పణంగా పెట్టడం లేదా ప్రమాదకరమైన పనులు చేయడం పిచ్చితనం, ఇది ప్రాణాలకే ముప్పు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ప్రమాదకరమైన ప్రదేశాలలో వీడియోలు తీయడం, అపాయకరమైన స్టంట్స్ చేయడం వంటివి అస్సలు చేయకూడదు. సురక్షితంగా, క్రియేటివ్‌గా వీడియోలు రూపొందించి ప్రజాదరణ పొందడం ఉత్తమం.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!