Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam Breaks Virat Kohli Record: పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ కింగ్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో బాబర్ ఆజం పెషావర్ జల్మీ (Peshawar Zalmi) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 338 ఇన్నింగ్స్‌ల్లోనే 12,000 పరుగుల మైలురాయిని చేరుకుని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్‌లో 351వ మ్యాచ్ ఆడుతున్న బాబర్, కేవలం 338 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును చేరుకోవడం విశేషం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (343 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (360 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ బ్యాటర్ కాగా, ఇప్పటికీ పాక్ తరపున అత్యధిక టీ20 పరుగుల రికార్డు షోయబ్ మాలిక్ పేరిట ఉంది.
READ MORE: Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!
Also Read
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 246/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. పెషావర్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. ఇఫ్తికార్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, సుఫియాన్ ముఖీమ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో కరాచీ కేవలం 87 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా బాబర్ సేన ఘన విజయాన్ని అందుకుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!