Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసు..15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ! ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కుర్రాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: నిన్న(శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆధారంగా, రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఫోర్‌తో తన ఖాతాను తెరిచాడు. అనుభవజ్ఞులైన జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లను సైతం లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో ఖాతా తెరిచిన ఈ కుర్రాడు, రెండో ఓవర్లో యశస్వి జైస్వాల్ అవుటైనప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. హేజిల్‌వుడ్ వేసిన వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ సీజన్‌లో సూర్యవంశీ ఇలా 15 బంతుల్లోనే అర్ధశతకం బాదడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా బర్సపరా స్టేడియంలో ఇదే ఘనత సాధించాడు.
READ MORE: Sam Altman Controversy: ChatGPT సీఈవోపై ఉద్యోగుల సంచలన ఆరోపణలు..
Also Read
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
దీంతో ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన భారతీయుల జాబితాలో సూర్యవంశీ తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ (13 బంతులు), కేఎల్ రాహుల్ (14 బంతులు) మొదటి రెండు స్థానాల్లో ఉండగా, యూసుఫ్ పఠాన్ (15 బంతులు) రికార్డును సూర్యవంశీ రెండుసార్లు సమం చేశాడు. అంతేకాకుండా, రాజస్థాన్ రాయల్స్ తరఫున పవర్ ప్లే (తొలి 6 ఓవర్లలో) లోనే హాఫ్ సెంచరీ బాదిన జోస్ బట్లర్ రికార్డును కూడా ఈ యువ ఆటగాడు అందుకున్నాడు. రాజస్థాన్ జట్టులో ఈ ఘనతను జైస్వాల్ రెండుసార్లు సాధించగా.. మైఖేల్ లంబ్, బెన్ స్టోక్స్, నితీష్ రాణా ఒక్కోసారి చొప్పున సాధించారు.
READ MORE: Hair Care Tips: సాంబ్రాణి ధూపంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా మారిపోతుంది తెలుసా..?
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే, వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు 201 పరుగుల భారీ స్కోరును అందించాడు. విరాట్ కోహ్లీ (32), రోమారియో షెపర్డ్ (22), వెంకటేష్ అయ్యర్ (29) కూడా తమ వంతు సహకారం అందించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మలు తలో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
READ MORE: Hair Care Tips: సాంబ్రాణి ధూపంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా మారిపోతుంది తెలుసా..?
ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ (భారత బ్యాట్స్‌మన్)
13 బంతుల్లో- యశస్వి జైస్వాల్ ( రాజస్థాన్ రాయల్స్ ) vs KKR, కోల్‌కతా, 2023
14 బంతుల్లో- KL రాహుల్ (పంజాబ్ కింగ్స్) vs ఢిల్లీ క్యాపిటల్స్, మొహాలీ, 2018,
15 బంతుల్లో సన్‌కేఆర్, హైదరాబాద్, సన్‌కేఆర్ పఠాన్
15 బంతులు- వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) vs చెన్నై సూపర్ కింగ్స్, గౌహతి, 2026
15 బంతులు- వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) vs RCB, గౌహతి, 2026
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!