Khauf: వీకెండ్ మొదలైంది. ఈ వీకెండ్‌కు ఇంట్లోనే ఉండి ఓటీటీలో మంచి థ్రిల్లర్ సిరీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఇటీవల ‘అమెజాన్ ప్రైమ్’ వీడియోలో విడుదలైన ఒక సిరీస్ ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఇది ప్రేక్షకులకు వెన్నులో వణుకుపుట్టేలా చేస్తోంది. ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి అనేక ప్రశంసలను అందుకుంది. ఈ సిరీస్ పేరు “ఖౌఫ్”. ఈ హర్రర్ సిరీస్‌ను స్మితా సింగ్ రూపొందించారు. మోనికా పవార్, రజత్ కపూర్, చుమ్ దరాంగ్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ బాగా ప్రశంసలు అందుకుంది. IMDbలో 7.1 రేటింగ్‌ను కలిగి ఉంది. ‘ఖౌఫ్’ సిరీస్, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘అమెజాన్ ప్రైమ్’ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
READ MORE: Chiranjeevi-Pawan Kalyan :మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. చిరు–పవన్ నుంచి వరుస అప్డేట్స్
కథ ఏంటి.?
మాధురి అనే విద్యార్థిని ఎన్నో కలలతో ఢిల్లీ చేరుకుంటుంది. సిటీలోని హాస్టల్‌లో ఉండేందుకు ఆమె వద్ద తగినంత డబ్బు ఉండదు. దాంతో నగర శివారులోని ఓ హాస్టల్‌లో చేరుతుంది. వాస్తవానికి.. నిక్కీ, స్వెత్లాన, కోమలి, రీమా ఒక రూములోనే ఉంటారు. రీమా గర్భవతి అయినప్పటికీ, అత్తింటి వారి టార్చర్ కారణంగా హాస్టల్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది. వారికి ఎదురు రూములో ఉండే ‘అనూ’ 6 నెలల క్రితం చనిపోతుంది. అప్పటి నుంచి ఆ రూములో ప్రేతాత్మ ఉందని వాళ్లంతా భయపడుతూ ఉంటారు. గ్వాలియర్ కి చెందిన మాధురి, ఢిల్లీలో ఉండే అరుణ్ ప్రేమించుకుంటారు. ఒకసారి వాళ్లిద్దరూ కలిసి ఉన్నప్పుడే ముగ్గురు ముసుగు వ్యక్తులు దాడి చేస్తారు. అదే సమయంలో మాధురి రేప్ కి గురవుతుంది. ఆ సంఘటనను మరిచిపోవడానికిగాను మాధురిని కూడా ఢిల్లీ రమ్మంటాడు అరుణ్. దాంతో ఆమె ఢిల్లీ వెళ్లి అక్కడ జాబ్ సంపాదిస్తుంది. ఆ విషయంలో ఆమెకి ‘బేలా’ .. ఆమె బాయ్ ఫ్రెండ్ ‘నకుల్’ సాయపడతారు. ఆ జాబ్ చేస్తూ ఆమె వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో .. గతంలో ‘అనూ’ ఉన్న రూములోనే దిగుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.