శరీరం దృఢంగా, బలమైన కండరాలు కలిగి ఉండాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి తగినట్టుగా జిమ్‌కెళ్లి రకరకాల వ్యాయామాలు చేసి కష్టపడుతుంటారు.
భారత విదేశాంగ కార్యదర్శిగా.. దేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (డిప్యూటీ ఎన్ఎస్ఏ) విక్రమ్ మిస్రీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడిన 60 మంది భారతీయులను శ్రీలంకలోక్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ (సీఐడీ) అరెస్టు చేసింది. కొలంబోలోని మడివెల, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుంచి వారిని గురువారం అరెస్టు చేశారు. ఈ దాడిలో 135 మొబైల్స్, 57 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి ఎస్ఎస్పి నిహాల్ తల్దువా తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. అనుమానంతో నెగొంబోలోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు […]
భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం విడుదలయ్యారు. ఆయన ఈ కేసులో అయిదు నెలలు జైలులో ఉన్నారు.
పార్లమెంట్ సమావేశాల ఐదో రోజైన శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం క్షీణించింది. ఫూలో దేవిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు భారతీయ రైల్వే కూడా ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. నేషనల్ ట్రాన్స్పోర్టర్ 2030 నాటికి గ్రీన్ రైల్వేను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరిన ఎలాన్ మస్క్ 53వ పుట్టినరోజు నేడు. ఎలాన్ మస్క్ కు తన పుట్టిన రోజున షాక్ తగిలింది. మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయారు.
కాంగ్రెస్ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుందని..కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేయడం వల్ల తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ సిటీ ఆఫీస్ లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించారు.
తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని..చేరికల విషయంలో మనస్థాపం చెందానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నానన్నారు.