మీరు సీఎం..సీఎం అంటే నాకు భయం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో సమావేశమయ్యారు.
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ట్రోఫీని తీసుకున్నారు. 140 కోట్ల మంది దేశప్రజల ఆనందానికి అవధులు లేవు.
ద్రోణి ప్రభావంతో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే గెలుపు గుర్తుకు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీని గెలిపించింది..జనసైనికులే అని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రౌడీ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉరివేసుకుని కనిపించాయి. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకున్నారు.
నవంబర్ నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ డోనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. ఈ నెల మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు అధికారిక ప్రతినిధిగా భారత సంతతికి చెందిన డాక్టర్ సంపత్ శివంగి ఎంపికయ్యారు.
నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనం నుంచి దూకి ఒక వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. చేజర్ల మండలం చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్న జ్యోతి ... క్యాన్సర్ కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వైద్యులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరైంది.
కేంద్రం సహాయంతో అయిదేళ్లలో ఆర్టీసీ (RTC)లో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడతామని..త్వరలోనే 1400కొత్త బస్సులు రాబోతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు.
కడప జిల్లా కాజిపేటలోని జడ్పీ హైస్కూలులో విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. నిన్నటి నుంచి కడప ప్రభుత్వ ఆసుపత్రిలో 10మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు.
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. లద్దాఖ్ లో నది దాటుతూ యుద్దట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.