రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేవలం వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. గతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు సమాచారం అందించారు. రాబోయే మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
తన భద్రత కుదింపుపై ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేకదారులు రోడ్డెక్కారు. ఈ నిరసనల్లో వందలాది మంది మృతి చెందారు. దీంతో హసీనా సర్కారు పడిపోయింది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా పార్టీ మార్పుపై వార్తలొస్తున్న నేపథ్యంలో నేడు రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ.. "వైసీపీ కి రాజీనామా చేస్తున్నాను.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. చేనేత కళాకారుల కలలు మరుగున పడ్డాయని తెలిపారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీకి ఛాలెంజింగ్‌గా మారింది. పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటంతో నామినేటెడ్ పదవుల భర్తీ కత్తి మీద సాములా మారింది. టీటీడీ, ఏపీఎస్సార్టీసీ, ఏపీ ఎండీసీ, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఐడీసీ, పీసీబీ, అప్కాబ్, మార్క్ ఫెడ్, దుర్గ గుడి ఛైర్మన్ వంటి కీలక పదవులకు డిమాండ్ పెరిగింది.
మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుడిని చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
బ్యాంకు మోసం కేసులో 20 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం పట్టుకుంది. అతన్ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. ఆగస్టు 16 వరకు రిమాండ్‌కు పంపారు. నిందితుడు చనిపోయినట్లు కొన్నేళ్ల క్రితం ఇక్కడి కోర్టు ప్రకటించింది.
చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో.. గురువులు మందలించారనో.. ప్రేమ విఫలమైందనో ఇలా పులు కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు.