Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్‌పై హిట్‌మ్యాన్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Run Out: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా శనివారం (జూన్ 13) జరిగిన తొలి వన్డే మ్యాచ్ కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందు 195 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ ఎంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. మొదటి వికెట్‌కు 46 పరుగులు జోడించి ఆఫ్ఘన్ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. టీమిండియా ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో యువ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ వేసిన బంతిని రోహిత్ మిడ్‌వికెట్ వైపు బాది, క్విక్ సింగిల్ కోసం పరుగెత్తాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ సైతం మొదట రన్ తీసేందుకు ముందుకు వచ్చాడు. కానీ, కొన్ని అడుగులు వేసిన తర్వాత సడన్‌గా మనసు మార్చుకుని రోహిత్‌ను వెనక్కి వెళ్ళిపోవాలంటూ వారించాడు. అప్పటికే రోహిత్ పిచ్‌పై చాలా దూరం ముందుకు వచ్చేయడంతో వెనక్కి తిరిగే లోపే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఆఫ్ఘన్ స్టార్ రషీద్ ఖాన్ మెరుపు వేగంతో స్పందించి బంతిని వికెట్ కీపర్‌కు అందించగా.. అతను బెయిల్స్ ఎగరేశాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం కూడా ఆగకుండా, తాను అవుట్ అయ్యాననే అసహనంతో రోహిత్ శర్మ క్రీజ్ వదిలి పెవిలియన్ వైపు నడిచాడు. వాస్తవానికి.. నిన్నటి మ్యాచ్ రోహిత్‌కు తన ఫామ్ నిరూపించుకునే చక్కటి అవకాశం. ఈ మ్యాచ్‌లో కనీసం ఆఫ్ సెంచరీ అయినా స్కోర్ చేస్తాడని, తనను తాను మరోసారి నిరూపించుకుంటాడని అభిమానులు ఎంతో ఆశ పడ్డారు. కానీ.. గిల్ రోహిత్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఇక, కేవలం 16 పరుగులకే ఇలా అనవసరంగా రనౌట్ అవ్వడంపై రోహిత్ ముఖంలో తీవ్ర అసంతృప్తి కనిపించగా, ఈ తప్పిదానికి కారణమైన గిల్ సైతం తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఒక సెట్ బ్యాటర్ వికెట్ పడటంతో ఆఫ్ఘనిస్తాన్‌కు మ్యాచ్‌లోకి వచ్చే అవకాశం దొరికినప్పటికీ.. భారత్ ఆ తర్వాత అద్భుతంగా రాణించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ పెద్ద స్కోరు చేయలేకపోయినప్పటికీ.. అతని కెరీర్లో ఇదొక చారిత్రాత్మక మ్యాచ్‌గా నిలిచిపోయింది. 39 ఏళ్ల 44 రోజుల వయసులో బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. వన్డే క్రికెట్ ఆడిన అత్యంత పెద్ద వయసు భారతీయ ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో 1983 ప్రపంచకప్ హీరో మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉన్న 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. అమర్నాథ్ 1989లో తన 39 ఏళ్ల 36 రోజుల వయసులో చివరి వన్డే ఆడారు. అంతేకాదు, ఇదే మ్యాచ్‌లో రోహిత్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించి అభిమానులను ఖుషీ చేశాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..