కొందరికి వయసు పెరుగుతున్న పెళ్లి సెట్ అవ్వదు. ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. అయితే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవ గ్రహాల్లో అంగారక గ్రహాన్ని జ్యోతిషం ప్రకారం కుజుడుగా పేర్కొంటారు. ఈయనను మంగళుడు అని కూడా అంటారు. జాతకంలో కుజదోషం ఉంటే వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయట. కుజదోషం ఉంటే జీవితంలో పలు సమస్యలు సంభవిస్తాయంటారు. కుజ దోష నివారణకు అనేక పరిహారాలు ప్రచారంలో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహా మేరకు ఆయా పరిహారాలు చేయడం వల్ల కుజ దోషం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కుజ దోషం వల్ల ఎక్కువ వైవాహిక జీవితంలో సమస్యలు, వివాహం కావడం ఆలస్యమవడం, సంతానం పొందడంలో సమస్యలు ఏర్పడతాయి. మానసిక ఉద్రిక్తతలు, దంపతుల మధ్య గొడవలు, సంతాన లేమి, విడాకులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని నమ్ముతారు.
READ MORE: Monsoon session: పార్లమెంట్‌లో ‘‘ఆపరేషన్ సిందూర్’’పై చర్చించేందుకు కేంద్రం సిద్ధం..
నివారణ మార్గాలు..
కుజ దోష ప్రభావాలు తొలగించుకోవడానికి ఉత్తమమైన మార్గము అమ్మ వారిని (దుర్గాదేవి) పూజించడమే అని జ్యోతిష్కులు చెబుతున్నారు. కుజ దోషమున్నవారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలట. సంవత్సరములో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవితి వంటి ముఖ్యమైన రోజులు విశేషంగా సుబ్రహ్మణ్యున్ని పూజించాలని చెబుతున్నారు. కుజదోషము తీవ్రముగా ఉన్న జాతకులు కుజ గ్రహ శాంతులు, కుజగ్రహ హోమాలు, కుజగ్రహ జపాలు, దానాలు ఆచరించి తీరాలట. కుజదోషము ఉన్న జాతకులు జీవితములో నిత్యం సుబ్రహ్మణ్యున్ని పూజిస్తూ, సుబ్రహ్మణ్యునికి అభిషేకాలు వంటివి ఆచరించినట్లయితే వారి జాతకములో ఉన్న కుజ దోషము నివృత్తి జరిగేటటువంటి అవకాశముంటుందని నమ్మిక.
READ MORE: HHVM : వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుద్ది.. నిర్మాత కాన్ఫిడెన్స్..