Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్‌లోనే వైభవ్ చెత్త రికార్డు.. ఆ ఘనత నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ అభిమానులను ఊరించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్ ముగిసింది! విల్ జాక్స్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన వైభవ్ క్రీజ్ వదిలి ముందుకు రాగా, వికెట్ కీపర్ జోస్ బట్లర్ క్షణాల వ్యవధిలో స్టంపింగ్ చేశాడు. థర్డ్ అంపైర్ రివ్యూ చేసినప్పటికీ.. వైభవ్ అప్పటికే క్రీజ్ వెలుపల స్పష్టంగా ఉండిపోవడంతో అవుట్‌గా ప్రకటించారు. ఇక తొలి మ్యాచ్‌లోనే కేవలం 10 బంతులు ఆడిన వైభవ్ 2 భీకరమైన సిక్సర్లతో 14 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. దీంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. ఇక కేవలం 14 పరుగులే చేసినప్పటికీ, తన దూకుడైన ఆటతీరుతో ఈ బిహార్ కుర్రాడు భవిష్యత్తుపై భారీ అంచనాలను రేకెత్తించాడు. కానీ అనుకున్న స్థాయిలో పరుగులు రాబట్టలేకపోవడంతో నిరాశకు గురయ్యారు. అయితే, ఈ అవుట్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లోనే స్టంప్ అవుట్ అయిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్‌పై ఇంగ్లాండ్ అరంగేట్రం పేసర్ జోష్ టంగ్ వేసిన ఎక్స్ట్రా బౌన్స్‌కు వైభవ్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. భారీ షాట్లకు ప్రయత్నించి రెండు సార్లు బీట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక యార్కర్ బంతికి ఇన్సైడ్ ఎడ్జ్ ద్వారా సింగిల్ తీసి అంతర్జాతీయ క్రికెట్లో తన మొదటి పరుగును ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తన సహచరుడైన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మోకాళ్ళపై కూర్చుని వికెట్ కీపర్ మీదుగా కొట్టిన అద్భుతమైన సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత జోష్ టంగ్ వేసిన స్లోయర్ బాల్‌ను మిడ్‌వికెట్ మీదుగా మరో భారీ సిక్సర్‌గా మలిచాడు. అయితే, పార్ట్-టైమ్ ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ వేసిన ఫ్లాటర్ డెలివరీని క్రీజ్ వదిలి ముందుకు వచ్చి కట్ చేయబోయి, వేగంలో వైవిధ్యాన్ని అంచనా వేయలేక జోస్ బట్లర్ చేతికి చిక్కి స్టంప్ అవుట్ అయ్యాడు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక, టీ20 ఫార్మాట్లో సహజంగానే బ్యాటర్లు దూకుడుగా ఆడటానికి ప్రయత్నిస్తారు. ఐపీఎల్లో రికార్డు స్థాయిలో 776 పరుగులు, అత్యధిక సిక్సర్లతో విరుచుకుపడిన వైభవ్ లాంటి అసాధారణ ప్రతిభావంతుడికి అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడటానికి కనీసం 4 నుంచి 5 మ్యాచ్‌ల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. జట్టు స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఇలాంటి రిస్క్‌లు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు అనవసరంగా అవుట్ అయినట్లు అనిపించినప్పటికీ, సుదీర్ఘ కాలంలో భారత జట్టు ఆశించే దూకుడైన ఆటతీరుకు వైభవ్ సూర్యవంశీ కచ్చితంగా సరిపోతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!