Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eluru: ఏలూరు జిల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి దారుణంగా చోటు చేసుకుంది. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు కోల్పోయారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్లాట్ఫారం సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా, విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ ప్రత్యేక రైలు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న షేక్ చాంద్ బాషా (50), ఆయన భార్య షేక్ హసీనా (45), వారి కుమార్తెలు షేక్ షర్మిల (23), షేక్ సమీరా (20)గా రైల్వే అధికారులు గుర్తించారు. వీరిలో పెద్ద కుమార్తె షర్మిల ఎంబీఏ చదువుతోంది. చాంద్ బాషా, హసీనా దంపతులు తాడేపల్లిగూడెంలో ఒక ఆప్టికల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మృతుల నేపథ్యం పరిశీలిస్తే.. వీరి స్వస్థలం గుడివాడ కాగా, సుమారు 25 ఏళ్ల క్రితమే వీరు తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని 6వ వార్డు, మామిడితోట ప్రాంతంలో గత మూడేళ్లుగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే, ఈ కుటుంబం కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన జూలై 4వ తేదీ సాయంత్రం కూడా ఈ కుటుంబ సభ్యులంతా కలిసి రెండు మోటార్‌సైకిళ్లపై ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు పొరుగువారు గుర్తుచేసుకున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ సీఐ, ఎస్ఐలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!