King100: నాగ్ 100వ సినిమాకు డీఎస్పీ ఎంట్రీ.. అంచనాలు పెంచిన క్రేజీ కాంబో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King100: అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ మూవీ ‘కింగ్ 100’. ఈరోజు ఈమూవీ నుంచి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా ప్రకటన తర్వాత వరుసగా ఆసక్తికరమైన వార్తలు వస్తుండగా, ఇప్పుడు చిత్ర బృందం మరో భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ఆఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఆదివారం (AUG 2) దేవి శ్రీ ప్రసాద్ 47వ పుట్టినరోజు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన డీఎస్పీకి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో ఈ మూవీపై మరింత ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది.
నాగార్జున, దేవి శ్రీ ప్రసాద్ కాంబో తెలుగు ప్రేక్షకులకు కొత్తది కాదు. గతంలో ‘మన్మధుడు’, ‘మాస్’, ‘కింగ్’, ఇటీవల వచ్చిన ‘కుబేర’ వంటి సినిమాలకు డీఎస్పీ సంగీతం అందించి మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ నుంచి వచ్చిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే హిట్ కాంబో మరోసారి ‘కింగ్ 100’ కోసం ఒక్కటవుతుండటంతో మూవీపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో ప్రముఖ నటి టబు కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నాగార్జున, టబు జంటకి గతంలో హిట్ జోడీగా పేరుంది. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేకత ఏర్పడింది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఈ మూవీకి రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నాగార్జున కెరీర్లో ఇది 100వ సినిమా కావడంతో కథ, టెక్నికల్ అంశాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలను దశలవారీగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి కొత్త ప్రకటనతో ‘కింగ్ 100’పై అంచనాలు పెరుగుతుండగా, డీఎస్పీ సంగీతం మాత్రం ఈ మూవీకి ప్లస్ గా మారనుంది. ఇక నాగార్జున కెరీర్లోనే ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?