మనకు బ్రతికే అదృష్టం ఉంటే.. ఎంతటి ప్రమాదం వచ్చినా ఏమి కాదు. చిన్న గాయం కూడా కాకుండా బ్రతికి బయటపడతాం. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. కొన్ని ప్రమాదాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉంటాయి. ఏదో యముడు సెలవుకు వెళ్లినట్లుగా కొంతమంది ఆ ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటారు. అలాంటి ఘటనే తాజాగా కుప్పంలో చోటు చేసుకుంది. కుప్పం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు త్రుటిలో ప్రమాదం నుంచి…
విశాఖ కలుషిత ఆహార నగరంగా మారింది.. చిన్నపిల్లలు తినే తిండి దగ్గర నుంచి, మహిళలు, గర్భిణీలు తినే ఆహారాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వారం రోజుల నిల్వ ఉంచిన ఫుడ్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన మాంసపు పదార్థాలతో వంటకాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
HIV Vaccine: ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గత కొన్ని సంవత్సరాలుగా HIV వంటి ప్రమాదకరమైన వ్యాధితో పోరాడటానికి సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం వెతుకుతున్నారు. తాజాగా వ్యాక్సిన్ కనుక్కోవడంలో ఆశ కనిపించింది. ఓ ప్రయోగాత్మక వ్యాక్సిన్‌పై పరీక్ష నిర్వహించగా.. ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. కానీ ఈ వ్యాక్సిన్ పూర్తిగా విజయవంతమవుతుందా..? అనే సందేహం మొదలైంది. ఈ కొత్త HIV వ్యాక్సిన్ మొదటి ట్రయల్ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో నిర్వహించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం అభిమానులను కూడగట్టుకున్నారు. బాలీవుడ్లో కూడా మంచి పేరు సంపాదించిన రజినీకాంత్ అభిమానుల సంఖ్య అపారం. 74 ఏళ్ల వయసులో కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఈ వయసులో సైతం ప్రధాన నటుడిగా సినిమాలు చేస్తూ ప్రజాధారణ పొందుతున్నారు.
Car Sales Slow Down: పండుగ సీజన్ కు ముందు కార్ల మార్కెట్ మందకొడిగా కనిపిస్తోంది. జూలైలో కార్ల అమ్మకాలు తగ్గాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా, హోండా వంటి పెద్ద కంపెనీల అమ్మకాలు తగ్గాయి. దేశంలోని అతిపెద్ద ఆటో కంపెనీ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మహీంద్రా & మహీంద్రా, కియా అమ్మకాలు పెరిగాయి. కానీ డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో నిరాశ ఉందని నిపుణులు అంటున్నారు. కార్ల అమ్మకాల తగ్గుదలకు చాలా కారణాలు ఉన్నాయి.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులు నేడు విడుదలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ కింద నిధులను మోడీ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన రూ.20వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా.. లబ్ధిదారుల జాబితాలో పేరుండి ఈ నగదు మీ ఖాతాలో జమ కాలేకపోతే pmkisan-ict@gov.in ఇమెయిల్ ఐడి ద్వారా తనిఖీ చేయవచ్చు. లేదా పీఎం కిసాన్ యోజనక చెందిన హెల్ప్‌లైన్ నంబర్ -…
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఇటీవల ప్రచురించిన పరిశోధన ఓ పెద్ద ప్రమాదాన్ని లేవనెత్తింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ, 2025లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని ప్రజలు లైంగిక కార్యకలాపాల సమయంలో తమ బలాన్ని పెంచుకోవడానికి యువత అనేక రకాల మందులను ఉపయోగిస్తున్నారని తేలింది.
రైలు ప్రమాదం ఈ పేరు వింటేనే కొందరికి భయమేస్తోంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని సాంకేతిక లోపాలు, తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఏదో తెలుసా? దాదాపు 1700 మందిని బలిగొన్న ఈ ప్రమాదం శ్రీలంకలో చోటు చేసుకుంది. 2004లో జరిగిన ఈ దుర్ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.