Bengaluru: ఒక్కగానొక్క బిడ్డ మృతి.. అంబులెన్స్, ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం ఎక్కడ చూసిన లంచాలే..! చివరికీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూరుకు చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) రిటైర్డ్ అధికారి హృదయ విదారక సోషల్ మీడియా పోస్ట్ వేలాది మందిని కదిలించింది. తన ఏకైక కుమార్తె మరణంతో బాధతో అల్లాడిపోయిన ఆయన.. అడుగడుగునా లంచాలు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని పేరు కె. శివకుమార్. BPCL మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా పరిచయం చేసుకున్నారు. అయితే.. తన 34 ఏళ్ల కుమార్తె అక్షయ మరణించింది. గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అక్షయ, 11 సంవత్సరాలు సెప్టెంబర్ 18, 2025న మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించింది. ఆమె కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ డిగ్రీ, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పట్టా పొందింది. తన కుమార్తె మరణాంతరం.. తాను ఎదుర్కొన్న అవినీతి గురించి మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు శివకుమార్..
READ MORE: IED Attack Pakistan: పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. కెప్టెన్ సహా ఆరుగురు మృతి
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
తన కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లే అంబులెన్స్ నుంచి పోలీసు అధికారులు, శ్మశానవాటిక సిబ్బంది, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కార్యాలయం వరకు దాదాపు అందరికీ లంచం ఇవ్వాల్సి వచ్చిందని శివకుమార్ పేర్కొన్నారు. అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి, మరణ ధృవీకరణ పత్రం పొందేందుకు అన్ని చోట్ల లంచం ఇచ్చానని వాపోయారు. “ఇటీవల, నా ఏకైక కుమార్తె 34 సంవత్సరాల వయసులో మరణించింది. అంబులెన్స్, ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులకు, రసీదు కోసం శ్మశానవాటిక వద్ద, మరణ ధృవీకరణ పత్రం కోసం బీబీఎంపీ కార్యాలయం ఇలా అని స్థలాల్లో బహిరంగంగా లంచాలు డిమాండ్ చేశారు” అని శివకుమార్ రాసుకొచ్చారు. ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం నివేదిక కాపీలను అందించిన పోలీసులకు సైతం తాను లంచం ఇచ్చానని తెలిపాడు. పోలీస్ స్టేషన్‌లో అందరి ముందు ఇచ్చానన్నారు. ఏకైక బిడ్డను కోల్పోయిన నా పట్ల ఎవ్వరికీ సానుభూతి లేదు. ఇది చాలా విచారకరం. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఇచ్చాను. పేదలు పరిస్థితి ఏంటి..? అని నిలదీశారు. ప్రభుత్వాన్ని, పలువురు ప్రముఖులపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ పోస్ట్ విస్తృతంగా వైరల్ అయ్యింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
శివకుమార్ పోస్ట్‌లో వివరించిన సంఘటనకు సంబంధించి.. బెల్లందూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక PSI, మరో పోలీస్ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు శాఖ ఎటువంటి దుష్ప్రవర్తన లేదా అనుచిత ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇంతలో తన కుమార్తె మరణం తర్వాత అవినీతి గురించి సోషల్ మీడియాలో భావోద్వేగంతో చేసిన K. శివకుమార్ పోస్ట్‌లపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాళవిక అవినాష్ సానుభూతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!